Site icon HashtagU Telugu

KING CHARLES: బ్రిటన్ తర్వాతి రాజుగా ప్రిన్స్ ఛార్లెస్

Prince Charles

Prince Charles

యునైటెడ్ కింగ్‌డమ్‌ను సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన పాలకురాలిగా రికార్డ్ సృష్టించిన క్వీన్ ఎలిజిబెత్ కన్నుమూయడంతో ఇప్పుడు ఆమె వారసుడు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం బ్రిటన్ తర్వాతి రాజుగా ప్రిన్స్ ఛార్లెస్ ను ప్రకటించే అవకాశం ఉంది.ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్ III పేరుతో కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అదే జరిగితే దాదాపు మూడు శతాబ్దాల తర్వాత బ్రిటన్ రాచరికంలో ఛార్లెస్ మళ్లీ రాజుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దాదాపు 337 ఏళ్ళ క్రితం కింగ్ ఛార్లెస్ 2 రాజుగా వ్యవహరించారు. ఇప్పుడు క్వీన్ ఎలిజిబెత్ కన్నుమూయడంతో ప్రిన్స్ ఛార్లెస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీవిపై బంకింగ్ హామ్ ప్యాలెస్ అధికారిక ప్రకటన చేయనుంది. కాగా 1952, సెప్టెంబ్ 9న తన తండ్రి కింగ్ జార్జి VI మరణానంతరం క్వీన్ ఎలిజబెత్ అధికారాన్ని చేపట్టారు.బ్రిటిష్ చరిత్రలో సుదీర్ఘకాలం పరిపాలించిన రాణిగా చరిత్ర సృష్టించారు.

ఇదిలా ఉంటే రాణి మరణిస్తే రాజ కుటుంబ సంప్రదాయాలు, ఆమెకు ఉన్న అర్హతల ప్రకారం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. జాతీయ పతాకాన్నిఅవనతం చేశారు. అన్ని చర్చుల్లో గంటలు మోగించారు. ముఖ్యంగా వెస్ట్‌మిన్‌స్టర్ చర్చి గంటను రాజకుటుంబాల సభ్యులు మృతి చెందితే మోగిస్తారు. ఆ చర్చి గంటను కూడా మోగించారు.