Revanth Reddy: చంచల్ గూడ జైలును విద్యా సంస్థగా మారుస్తాంః రేవంత్ కీలక ప్రకటన

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ పాతబస్తీని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని ప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మెట్రో ఫేజ్-2 ను తీసుకువస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. కులీ కుతుబ్ షాహీల నుంచి నిజాం వరకు హైదరాబాద్ […]

Published By: HashtagU Telugu Desk
111

Chanchalguda Jail will be converted into an educational institution: Revanth's key announcement

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ పాతబస్తీని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని ప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మెట్రో ఫేజ్-2 ను తీసుకువస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. కులీ కుతుబ్ షాహీల నుంచి నిజాం వరకు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగానే హైదరాబాద్ నగర ప్రతిష్ఠను నిలబెట్టేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగానే నగరం నడిబొడ్డున ఉన్న చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)ను ఇప్పుడు ఉన్న ప్రాంతం నుంచి మార్చేస్తామని వెల్లడించారు. ఆ స్థానంలో పాఠశాలలు, కళాశాలలు నిర్మించి.. ఆ ప్రాంతంలో పేదవారికి కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండా మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీని కోసం ఇప్పటికే లండన్‌లోని థేమ్స్ నగరాన్ని హైదరాబాద్ ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి సందర్శించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. గండిపేట నుంచి నగరంలోని 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 లో భాగంగా ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఓల్డ్ సిటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేసి ప్రయాణాలు ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తామని.. ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధిపైనే పూర్తి స్థాయిలో దృష్టిసారిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ హైదరాబాద్ సిటీ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఒరిజినల్ సిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంఐఎం పార్టీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధికి 2050 వైబ్రంట్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని.. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ.200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

read also : Kamal Haasan : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పై స్పందించిన కమల్‌హాసన్‌

 

  Last Updated: 09 Mar 2024, 02:58 PM IST