Site icon HashtagU Telugu

Dedicated Commission : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్

Chairman of the Dedicated Commission who meet CM Revanth Reddy

Chairman of the Dedicated Commission who meet CM Revanth Reddy

Busani Venkateswara Rao : తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు కోసం ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ కి చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు, మెంబర్ ఐఎఫ్ఎస్ అధికారి, బీసీ గురుకులాల సెక్రటరీ బి. సైదులు ను నియమించారు. ఈ క్రమంలోనే ఈ రోజు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావు మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి చర్చలు జరిపినట్లు సమాచారం. రిజర్వేషన్ల పై లోతైన సమకాలీన అధ్యయనం చేయాలని, నెల రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని కమిషన్ కి తాజాగా కాంగ్రెస్ సర్కార్ స్పష్టం చేసిన విషయం విదితమే. కాగా, డిసెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

Read Also : Bhadrachalam : ఏనుగుల దాడిలో ఆర్మీ జవాన్ మృతి