Chai Pani: అమెరికాలో బెస్ట్ రెస్టారెంట్.. దాని ప్రత్యేకత తెలిస్తే వావ్ అనాల్సిందే?

అమెరికాకు తరచుగా వెళ్తూ ఉండే భారతీయులకు అమెరికాలో ఉన్న చాయ్ పానీ రెస్టారెంట్ గురించి తెలిసే ఉంటుంది.

  • Written By:
  • Updated On - June 15, 2022 / 05:18 PM IST

అమెరికాకు తరచుగా వెళ్తూ ఉండే భారతీయులకు అమెరికాలో ఉన్న చాయ్ పానీ రెస్టారెంట్ గురించి తెలిసే ఉంటుంది. భారతీయ రెస్టారెంట్ అయిన చాయ్ పానీ రెస్టారెంట్ అమెరికాలో అత్యుత్తమ రెస్టారెంట్ గా గుర్తింపు తెచ్చుకుంది. నార్త్ కరోలినాలోని డౌన్ టౌన్ యాష్ విల్లేలో ఈ రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ ను 2009లో ప్రారంభించారు. అయితే ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటంటే భారతీయ స్నాక్స్ ను అందుబాటు ధరలో ఉంచడం ఈ రెస్టారెంట్ యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

తాజాగా చికాగోలో జరిగిన గేమ్స్ బియర్డ్ పౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా లోని అత్యుత్తమ రెస్టారెంట్ గా ఈ భారతీయ రెస్టారెంట్ ని ఎంపిక చేశారు. న్యూ ఓర్లాన్స్ కు చెందిన బ్రెన్నాన్ ను వెనక్కి నెట్టి మరి ఈ చాయ్ పానీ రెస్టారెంట్ మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. ఇకపోతే ఈ రెస్టారెంట్ లో క్రంచీ చాట్ 8.49 డాలర్ల నుంచి లభిస్తుంది. అలాగే థాలి వంటకాలు 16.99 డాలర్ల నుంచి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా వడ, పావ్ భాజీ, ఒక్కొక్కటి 10.99 డాలర్లు. చికెన్ టిక్కా రోల్ 11.99 డాలర్లు. కరోనా మహమ్మారి కారణం వల్ల ఈ అవార్డుల కార్యక్రమం రెండేళ్ల తర్వాత జరిగింది.

అయితే ఏ దేశంలో అయినా కొన్ని మంచి ఫుడ్ అన్నవి స్ట్రీట్ ఫుడ్స్ నుంచి ఉంటాయి. చాయ్ పానీ రెస్టారెంట్ అనేది చాయ్, క్రంచి, స్పైసీ, స్వీట్, ట్యాంగీ లతో కూడిన భారతీయ స్నాక్స్ కేంద్రం. మామూలుగా ఇంట్లో వండిన ఆహారాన్ని నుంచి ఏదీ సౌకర్యంగా ఉండదు అని అంటూ ఉంటారు. అచ్చం మన ఇంట్లో వండిన ఆహార మాదిరిగానే చాయ్ పానీ రెస్టారెంట్ సంప్రదాయ కుటుంబ భోజనాన్ని అందిస్తోంది.