Site icon HashtagU Telugu

CBSE Guidelines: వ‌చ్చే ఏడాది నుంచి రెండు సార్లు సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్‌.. రూల్స్ ఇవే!

Supplementary Result

Supplementary Result

CBSE Guidelines: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE Guidelines) 10వ తరగతి బోర్డు పరీక్షలను వచ్చే ఏడాది (2026) నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూపొందించిన ముసాయిదాను సీబీఎస్ఈ ఆమోదించింది. CBSE 10వ తరగతి బోర్డు పరీక్ష మొదటి దశ ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించనున్నారు. రెండవ దశ మే 2026లో నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్ పరీక్షకు కాలపరిమితి తగ్గుతుందని, రెండు సబ్జెక్టుల పరీక్షలో గ్యాప్ కూడా తగ్గుతుందని సీబీఎస్ఈ తెలిపింది.

ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తారు

కొత్త నిబంధనల ప్రకారం ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తారు. ముసాయిదా ప్రకారం.. CBSE బోర్డు 10వ పరీక్ష మొదటి దశ ఫిబ్రవరి 17 నుండి మార్చి 6 వరకు నిర్వహించనున్నారు. రెండవ దశ మే 5 నుండి 20 వరకు నిర్వహించనున్నారు.

Also Read: Bank Holiday: బ్యాంకు వినియోగ‌దారుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. రేపు బ్యాంకుల‌కు సెల‌వు!

CBSE జారీ చేసిన మార్గదర్శకాలలోని ముఖ్యమైన అంశాలు

ప్రాక్టికల్ పరీక్ష ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు

రెండు పరీక్షలను కచ్చితంగా సిలబస్‌ ప్రకారమే నిర్వహిస్తామని, అభ్యర్థులకు రెండు దశల్లో ఒకే పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. దరఖాస్తు సమయంలో రెండు పరీక్షలకు పరీక్ష రుసుము పెర‌గ‌నుంది. కొత్త నిబంధనల ప్రకారం.. బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. అయితే ప్రాక్టికల్స్, ఇంట‌ర్న‌ల్ మూల్యాంకనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తారు. బోర్డు పరీక్షల మొదటి, రెండవ దశలు సప్లిమెంటరీ పరీక్షలుగా కూడా పనిచేస్తాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక పరీక్ష నిర్వహించబడదని అధికారి తెలిపారు.