Kavitha : కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ..27న కౌంటర్‌ దాఖలు: సీబీఐ

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 02:08 PM IST

Kavitha: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బెయిల్‌ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ కౌంటర్(Counter)దాఖలు చేయగా… సీబీఐ(CBI) గడువు(Deadline) కోరింది. కవితకు బెయిల్ ఇవ్వవద్దంటూ ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

తాము మే 27న సీబీఐ కేసులో కౌంటర్ దాఖలు చేస్తామని, జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. మరోవైపు, ఈడీ కేసులో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈడీ లాయర్లు కోర్టుకు తెలిపారు. అయితే జాబితాలోని కేసుల విచారణ తర్వాత విచారణకు తీసుకుంటామని జడ్జి తెలిపారు.

Read Also: AP : పవన్ కళ్యాణ్ ను వదిలేది లేదు – బిజెపి క్లారిటీ

కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్ర ఉందని ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ట్రయల్ కోర్టు బెయిల్ త్కరస్కరించింది. లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 16న, సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.