Kavitha : సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

  • Written By:
  • Publish Date - April 12, 2024 / 04:43 PM IST

Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో సీబీఐ కస్టడీ(CBI Custody)కి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ఐదు రోజుల కస్టడీ(Custody)ని కోరగా… మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీలోకి తీసుకొని కవితను విచారించనుంది.

We’re now on WhatsApp. Click to Join.

మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ… అందులో కీలక అంశాలు పేర్కొంది. కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. మద్యం కేసులో కవిత చాలా కీలకమని, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు చెల్లించారని సీబీఐ కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి జాగృతి సంస్థకు రూ.80 లక్షల ముడుపులు ఇచ్చారని తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని బెదిరించినట్లు అందులో పేర్కొంది. సీబీఐ 11 పేజీలతో ఈ కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేసింది.

Read Also: Pawan Kalyan: డాక్టరేట్ అందుకుంటున్న చరణ్ కు పవన్ కల్యాణ్ విషెస్

జడ్జి ముందు కవితను సీబీఐ ప్రవేశపెట్టింది. ఐదు రోజుల కస్టడీ సీబీఐ కోరింది. కవితను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కోర్టుకు సీబీఐ తెలిపింది. కవిత సీబీఐ కస్టడీపై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రిజర్వ్ చేసి తాజాగా తీర్పు వెల్లడించింది కోర్టు. కవిత సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది ఈనెల 15 వరకు సీబీఐ కస్టడీలో ఉండనుంది. ప్రతీ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అనుమతి ఇచ్చింది కోర్టు.

Follow us