Site icon HashtagU Telugu

Two Headed Cat: రెండు తలల పిల్లి గురించి మీకు తెలుసా.. మీరు ఎప్పుడైనా చూశారా?

Two Heads Cat

Two Heads Cat

సాధారణంగా అప్పుడప్పుడు జంతువులు రెండు తలలు, మూడు కన్నులు, ఆరు కాళ్లు ఇలా చిత్ర విచిత్రంగా జన్మిస్తూ ఉంటాయి. అయితే అలా సాధారణంగా ఉండాల్సిన అవయవాలకు కంటే ఎక్కువ అవయవాలు తక్కువ అవయవాలతో జన్మించిన జంతువులు చాలా చాలా తక్కువగా బతుకుతూ ఉంటాయి. ఇప్పటికే రెండు తలలతో జన్మించిన ఆవు దూడలు, మేక పిల్లలు, కుక్క పిల్లలను చూసే ఉంటాం. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కాగా తాజాగా సోషల్ మీడియాలో ఒక పిల్లికి సంబంధించిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.

అయితే పిల్లి ఫోటో వైరల్ అయితే అందులో వింత ఏముంది అనుకుంటున్నారా. ఆ ఫోటోలు పిల్లి ఏకంగా రెండు తలలతో జన్మించింది. అయితే ఇలా రెండు తలలో జన్మించిన జంతువులు ఎక్కువగా బతకవు. జన్మించిన కొన్ని గంటల వ్యవదిలోని చనిపోతూ ఉంటాయి. కానీ తాజాగా థాయిలాండ్ లో పుట్టిన ఈ పిల్లి పిల్లలు మాత్రం ఆరోగ్యంగా ఉన్నాయి. అంతేకాకుండా రెండు తలలతో జన్మించిన ఈ పిల్లి రెండు మూతులతో పాలు తాగుతుండడంతో అది చూసి యజమాని మురిసిపోతున్నాడు. అంతేకాకుండా ఆ పిల్లికి టుంగ్ గ్రెన్, టుంగ్ టోంగ్ అని పేర్లను కూడా పెట్టాడట.

ఒక్కొ తలకు ఒక్కో పేరు పెట్టాడు అన్నమాట. అయితే ఈ పిల్లి ని కనడానికి దాని తల్లి అవస్థలు పడుతూ ఉండటంతో అది గమనించిన సదరు యజమాని వెంటనే స్థానిక పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లగా వాళ్ళు సిజరిన్ చేసి ఈ అరుదైన రెండు తలల పిల్లిని ప్రాణాలతో బయటకు తీశారట. ఆ రెండు తలల పిల్లి బతకడంతో యజమాని ఆనందంతో మునిగి తేలుతున్నాడు. అయితే ఈ పిల్లి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్లు బతికింది. అలాగే అత్యధికకాలం బతికిన జాసన్ క్యాట్ గా 2012 లోనే గిన్నిస్ బుక్ లోకి ఎక్కాయి.