IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్ వాఖ్యల వ్యవహారం తెలంగాణ హై కోర్టు(Telangana High Court) కు చేరింది. దివ్యాంగుల పై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వాఖ్యాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు. యూపీఎస్సీ చైర్మన్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ పై హైకోర్టు విచారించింది. పిటిషనర్ కు ఉన్న అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ ఒక వికలాంగులారని అడ్వకేట్ తెలిపింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశింది.
We’re now on WhatsApp. Click to Join.
ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చర్చ సంచలనంగా మారింది. వైకల్యం ఉన్న పైలట్‌ను విమానయాన సంస్థ నియమించుకుంటుందా? లేదా మీరు వికలాంగ సర్జన్‌ని విశ్వసిస్తారా. #AIS (IAS/ IPS/IFoS)లో ఫీల్డ్ వర్క్, పన్నుల వసూళ్లు, ప్రజా ఫిర్యాదులను నేరుగా విచారించడం వంటివి ఉంటాయి. కాబట్టి ఈ సేవకు ఈ కోటా అవసరమా అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. వికలాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు ఈ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వికలాంగులను ‘సంకుచిత దృక్పథంతో’ చూడరాదని, వారి అర్హతపై ఇలా మాట్లాడటం తగదని మండిపడ్డారు.