Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

ప్రస్తుతం అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. అమెరికా వాసులు ఎండ వేడిని తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటికి

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 05:30 AM IST

ప్రస్తుతం అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. అమెరికా వాసులు ఎండ వేడిని తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు. వేసవితాపాన్ని తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. అయితే అక్కడి ప్రజలు ఇంటి నుంచి రోడ్లపైకి రావాలి అంటేనే భయపడుతున్నారు. అయితే అక్కడికి ఎండలు ఏ విధంగా ఉన్నాయి అన్న దానికి తాజాగా జరిగిన ఒక సంఘటన చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎండ వేడిని తట్టుకోలేక గుర్రపు బగ్గిని లాక్కెళ్లే ఒక గుర్రం నడిరోడ్డు పైన కుప్పకూలింది. పాపం ఆ గుర్రం నడిరోడ్డుపై కుప్పకూలి దాదాపు గంట వరకు పైకి లేవలేకపోయింది.

ఆ తర్వాత అక్కడి పోలీసులు వచ్చి ఆ గుర్రానికి ఉన్న బెల్టును తొలగించారు. అనంతరం గుర్రాన్ని నీటితో తడిపారు. ఆ తర్వాత ఆ గుర్రం నిదానంగా చేరుకొని నిలబడగలిగింది. అయితే ఎండ వీడికి తట్టుకోలేక పడిపోయిన ఆ గుర్రం పరిస్థితిని చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా చలించి పోయారు. మాన్‌హట్టన్‌లోని హెల్స్ కిచెన్ ఏరియాలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోని చూసిన జంతు ప్రేమికులు ఆ గుర్రం పడుతున్న బాధను చూసి చలించిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

అయితే ఇది టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యింది కదా ఇప్పటికైనా అటువంటి గుర్రపు బగ్గీలకు స్వస్తి పలకాలి అని చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా గుర్రపు బగ్గీలకు స్వస్తి పలికి అటువంటి మూగజీవాలకు స్వేచ్ఛను కల్పించాలి అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పెటా స్పందిస్తూ గుర్రపు బగ్గీలను నిషేధించాలని డిమాండ్ చేసింది. పెద్ద నగరాలు గుర్రాల జీవనానికి అనువుకాదని తెలిపింది. వాహనాలు, మనుషులు, వాతావరణం, ఇతర అంశాల ప్రభావంతో అవి ఎప్పుడూ ప్రమాదాల మధ్యలోనే బతుకుతున్నాయని పేర్కొంటూ పెటా ట్వీట్ చేసింది.