Site icon HashtagU Telugu

Wheel Falls Off: గాల్లోకి విమానం.. నేల‌పైకి చ‌క్రం.. ఎక్క‌డంటే..?

Airplane Wheel 1280x720

Airplane Wheel 1280x720

ఇటలీలోని ఓ విమానాశ్రయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విమానం గాల్లోకి ఎగరగానే దాని వెనుక ఉండే ఓ చక్రం ఊడి పోయింది. దీంతో చక్రం లేకుండానే వేల కిలోమీటర్లు ప్రయాణించి చివరకు సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడ్డారు. బోయింగ్‌ 747 డ్రీమ్‌లిఫ్టర్‌ విమానం ఇటలీలోని టరాన్టో నుంచి అమెరికాలోని చార్లెస్టన్‌కు వెళ్తుండగా ఇది జరిగింది.

ఇటలీలోని టరాన్టో-గ్రోటాగ్లీ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది సేపటికే బోయింగ్ 747 డ్రీమ్‌లిఫ్టర్‌ లోని ప్రధాన చక్రాలలో ఒకటి బయటకు వచ్చింది. చక్రాలలో ఒకటి అండర్ క్యారేజ్ నుండి విడిపోయి రన్‌వే నుండి బౌన్స్ అవుతూ నేలపై పడింది. ఈ ఘటన గురించి సిబ్బందికి సమాచారం అందింది. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన నార్త్ కరోలినాలోని చార్లెస్‌టన్‌కు విమానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

బోయింగ్ 747-400 లార్జ్ కార్గో ఫ్రైటర్ (LCF) డ్రీమ్‌లిఫ్టర్ అనేది బోయింగ్ 747-400 ఎయిర్‌లైనర్‌పై ఆధారపడిన వైడ్-బాడీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్. ఈ విమానం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విడిభాగాలను ఇటలీ, జపాన్, U.S మధ్య రవాణా చేయడానికి రూపొందించ‌బ‌డింది. అయితే.. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగినట్లు తెలుస్తోంది.