Site icon HashtagU Telugu

Can’t Afford Petrol: బైక్ జర్నీకి గుడ్ బై.. గుర్రపు స్వారీకి సై!

Horse Riding

Horse Riding

ప్రస్తుతం నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇంధన ధరలు భగ్గుమంటుండటంతో పేద ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన షేక్ యూసుఫ్ కు అదిరిపొయే ఆలోచన వచ్చింది. పెట్రోల్ ధరలకు చెక్ పెట్టేలా గుర్రపు స్వారీ చేస్తున్నాడు. YB చవాన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ల్యాబ్ అసిస్టెంట్ అయిన షేక్ యూసుఫ్ రూ. 40,000తో ‘జిగర్’ అనే గుర్రాన్ని కొన్నాడు. అయితే అంతకుముందు యూసుఫ్ వద్ద పాత బైక్ ఉంది. కానీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు భరించలేక ప్రతిరోజు గుర్రంపై ఆఫీసుకు వెళ్తున్నాడు. తన ఇంటి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకు వెళ్లేందుకు గుర్రాన్నే ప్రయాణ సాధనంగా మార్చుకున్నాడు. గుర్రంపై వెళ్తున్న యూసుఫ్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆయన పనికి నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు.