Site icon HashtagU Telugu

Canadian MP in Kannada: కెనడా పార్లమెంట్ లో కన్నడం…ఉపన్యాసం దంచికొట్టిన ఎంపీ..వీడియో వైరల్..!!

Canadamp

Canadamp

భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ పార్లమెంటులో కన్నడ భాషలో ప్రసంగించారు. మాతృ భాష పట్ల తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. కెనడా ఎంపీ చంద్ర ఆర్య కన్నడలో ప్రసంగం చేసి ఎంతో మంది మనస్సుల్లో నిలిచాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. కెనడియన్ పార్లమెంటులో నేను నా మాతృభాషలో మాట్లాడాను. ఈ అందమైన భాషకు ఘణమైన చరిత్ర ఉంది. 5కోట్ల మంది ప్రజలు మాట్లాడతారు. భారత్ కు బయట ప్రపంచవ్యాప్తంగా ఒక పార్లమెంటులో కన్నడలో మాట్లాడటం ఇదే తొలిసారి అని చంద్ర ఆర్య ట్విట్టర్ పోస్టు చేశారు.

పార్లమెంట్ లో ప్రసంగించే అవకాశం వచ్చినప్పుడు ఆయన కన్నడంలో మాట్లాడాలని ఉందని సభా అనుమతి తీసుకున్నారు. రచయిత కువెంపు రాసిన, డాక్టర్ రాజ్ కుమార్ ఆలపించిన నీవు ఎక్కడ ఉన్నా…ఎలా ఉన్నా….ఎప్పుడూ కన్నడిగానే ఉండాలన్న పాటతో ప్రసంగాన్ని ముగించారు తోటి సభ్యులు చప్పట్లతో ఆయన్ను అభినందించారు.