Site icon HashtagU Telugu

Food: సూర్యకాంతి లేకుండా ఆహారాన్ని పండించవచ్చా.. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే?

Plants

Plants

కిరణజన్య సంయోగ క్రియ ఈ పదాన్ని మనము ఆరోవ తరగతిలోనే విని ఉంటాము. మొక్కలు సూర్యకాంత సమక్షంలో వాతావరణం లోని కార్బన్ డయాక్సైడ్ ను వినియోగించుకుని పిండి పదార్థాలను తయారు చేసుకోవడానికి కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. అయితే ఈ కిరణజన్య సంయోగ క్రియకు మూల కారణం సూర్యకాంతి. ఈ కిరణ జన్య సంయోగ క్రియ విషయానికి వస్తే ఈ భూమిపై నివసిస్తున్న జీవరాసులన్నింటికీ కిరణజన్య సంయోగ క్రియనే జీవన ఆధారం.

కిరణజన్య సంయోగక్రియలో క్రాంతి రసాయన శక్తిగా మారుతుంది. అలాంటి ద్వారా నీటి విశ్లేషణ జరుగుతుంది. ఫలితంగా ఆక్సిజన్ వాయువు వినబడుతుంది. చెట్లు మొక్కలు మనుషులు వదిలిన కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను వదులుతాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే సూర్యరశ్మితో చెట్లు పెరుగుతాయి అన్న విషయం అన్నకి తెలిసిందే. ఒకవేళ సూర్యరశ్మి లేకపోతే చెద్దు ఎదుగుదల కూడా సరిగా ఉండదు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా శాస్త్రవేత్తలు సూర్యరశ్మి లేకుండా చీకట్లో మొక్కలు పెరుగుతాయని మొదటిసారిగా అధ్యయనం చేసి వెల్లడించారు.

సూర్యరశ్మి ద్వారా కాకుండా మొక్కలు పెరగడానికి కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ అనే ఒక కొత్త పద్ధతిని పరిచయం చేశారు. సూర్యకాంతి లేకుండా కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియను పునరావృతం చేయడం కోసం శాస్త్రవేత్తలు ఇప్పుడు సరికొత్త మార్గంతో ముందుకు వచ్చారు.