Kohinoor Diamond : బ్రిట‌న్ రాజ‌కుమారికి కోహినూర్ కిరీటం

భార‌త్‌కు చెందిన అతి పురాత‌న‌మైన, అత్యంత ఖ‌రీదైన కోహినూర్ వ‌జ్రం మ‌ళ్లీ యువ‌రాణి కిరీటంలో మెర‌వ‌బోతోంది

  • Written By:
  • Publish Date - February 9, 2022 / 01:13 PM IST

భార‌త్‌కు చెందిన అతి పురాత‌న‌మైన, అత్యంత ఖ‌రీదైన కోహినూర్ వ‌జ్రం మ‌ళ్లీ యువ‌రాణి కిరీటంలో మెర‌వ‌బోతోంది.బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ సతీమణి, రాజకుమారి కెమిల్లా.. కోహినూర్‌ వజ్రం పొదిగివు న్న కిరీటాన్ని ధరించనున్నారు. చార్లెస్‌ ను రాజుగా ప్రకటించిన తర్వాత కెమిల్లా ఆ కిరీటాన్ని ధరిస్తారని బ్రిటన్‌లో ఓ ప్రముఖ పత్రిక పేర్కొంది. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌(95) సింహాసనాన్ని అధిష్ఠించి 70 ఏళ్లవుతున్న సందర్భంగా రాకుమారుడు చార్లె్‌సను రాజుగా ప్రకటించాలని ఎలిజబెత్‌ నిర్ణయించారని అధికారులు పేర్కొన్నారు.

క్రీ. శ. 1913 (1813) వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్‌ రాజుల నుంచి పంజాబ్‌పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌దీన్ని సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్‌సింగ్‌ ద్వారా బ్రిటిష్‌ గవర్నర్‌ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది. సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది.

తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్‌ రాణులు దీన్ని ధరించారు. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు. ఈ కారణంగా కోహినూర్‌ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947, 1953వ సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ కోహినూర్ వ‌జ్రం రాణి కిరీటంలో మెర‌వ‌బోతోంది.