Site icon HashtagU Telugu

CAG report : 25న ఢిల్లీ అసెంబ్లీ ముందుకు రానున్న కాగ్‌ రిపోర్ట్‌..?

CAG report to come before Delhi Assembly on 25..?

CAG report to come before Delhi Assembly on 25..?

CAG report  : ఈ నెల 25న అసెంబ్లీ ముందుకు ఢిల్లీ పరిపాలనకు సంబంధించి కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్ జనరల్‌ (CAG)రూపొందించిన నివేదిక రానుంది. ఈ 25న రిపోర్టు అసెంబ్లీ ముందుకు రానుండగా.. 25, 27 తేదీల్లో ఆ నివేదికపై చర్చ జరగనుంది. ఈ మేరకు ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ కాబోయే స్పీకర్‌గా ప్రచారం జరుగుతున్న విజేందర్‌ గుప్తా వెల్లడించారు.

Read Also: Hydra : ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? : హైడ్రా పై హైకోర్టు ఆగ్రహం

ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24న ప్రారంభమవుతాయి. 24, 25, 27 తేదీల్లో మొత్తం మూడు రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి. 24న ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌.. ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరితో ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఢిల్లీ అసెంబ్లీ తొలిసారి సమావేశం కాబోతున్నది.

ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ డిమాండ్‌ చేసింది. కానీ ఆప్‌ సర్కారు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలకు కేవలం 20 రోజులు మాత్రమే ఉన్నందున.. ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, 25న ప్రభుత్వం కాగ్‌ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. 25, 27 తేదీల్లో రెండు రోజులపాటు ఆ నివేదికపై చర్చ జరుగుతుంది. ప్రభుత్వ నిధులను పాలకులు దుర్వినియోగం చేశారని, ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది.

Read Also: Solar Soundbox : సోలార్‌ సౌండ్‌ బాక్స్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?