121 Year Old Cadbury Auction : ఒక వేడుక..ఒక స్టూడెంట్..121 ఏళ్ళ కిందటి క్యాడ్‌బరీ చాక్లెట్ వేలానికి !

121 Year Old Cadbury Auction : 121 ఏళ్ల నాటి ఒక క్యాడ్‌బరీ చాక్లెట్‌ను వేలానికి పెట్టారు.. 

  • Written By:
  • Updated On - July 17, 2023 / 08:46 AM IST

121 Year Old Cadbury Auction : క్యాడ్‌బరీ చాక్లెట్ల కంపెనీ హిస్టరీ చాలా పెద్దది..  

సరిగ్గా 200 ఏళ్ళ క్రితం (1824లో)  క్యాడ్‌బరీ చాక్లెట్ల కంపెనీ బ్రిటన్ లోని బర్మింగ్ హాం వేదికగా చాక్లెట్ల ఉత్పత్తిని స్టార్ట్ చేసింది. 

ఇక కొత్త విషయం ఏమిటంటే.. 121 ఏళ్ల నాటి ఒక క్యాడ్‌బరీ చాక్లెట్‌ను వేలానికి పెట్టారు.. 

1902 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ VII, ఇంగ్లాండ్ రాణి అలెగ్జాండ్రా పట్టాభిషేకానికి గుర్తుగా క్యాడ్‌బరీ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి ప్రత్యేక చాక్లెట్లు తయారు చేయించారు. 

పట్టాభిషేకానికి గుర్తుగా ఆ ప్రత్యేక చాక్లెట్లను ఇంగ్లాండ్ లోని స్కూళ్లలో పిల్లలకు పంపిణీ చేశారు. 

అయితే అప్పుడు 9 ఏళ్ల వయసున్న బాలిక మేరీ ఆన్ బ్లాక్‌మోర్‌ తనకు ఇచ్చిన క్యాడ్‌బరీ వెనీలా చాక్లెట్ ను తినకుండా భద్రంగా దాచుకుంది.  

ఈ వెనీలా చాక్లెట్ ను దశాబ్దాలుగా మేరీ కుటుంబం తీపి జ్ఞాపకంగా కాపాడుతూ వచ్చింది.   

మేరీ ఆన్ బ్లాక్‌మోర్‌ చనిపోయింది. ఇప్పుడు ఆమె మనవరాలు 72 ఏళ్ళ జీన్ థాంప్సన్ తనకు వారసత్వంగా అందిన ఈ చారిత్రక చాక్లెట్ ను వేలానికి పెట్టింది. హాన్సన్స్ ఆక్షనీర్స్” అనే సంస్థ ద్వారా ఈ  చాక్లెట్ ను వేలం వేస్తున్నారు. “హాన్సన్స్ ఆక్షనీర్స్” ఎన్నో విలువైన వస్తువులను నిత్యం వేలానికి పెడుతుంటుంది . ఈక్రమంలో ఆ వెబ్ సైట్ ను సెర్చ్ చేస్తున్న కొందరు  యూజర్స్ కు ఈ 121 ఏళ్ల హిస్టారికల్ చాక్లెట్ (121 Year Old Cadbury Auction) కంటపడింది. వారు దాని వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ టాపిక్ వైరల్ గా మారింది. ఈ  చాక్లెట్ పెట్టెపై అప్పటి బ్రిటన్ రాజు, రాణి ఫోటోలు కూడా ఉన్నాయి. ఇక వేలం పాటలో ఈ క్యాడ్‌బరీ వెనీలా చాక్లెట్ ధర దాదాపు రూ. 16,000 పలుకుతుందని అంచనా వేస్తున్నారు.