Leftover Food : ఇతరుల ఎంగిలి తింటే..ఏమవుతుందో తెలుసా?

Leftover Food : ఇతరుల ఎంగిలి తినొచ్చా ? తినొద్దా ?

  • Written By:
  • Updated On - May 28, 2023 / 01:33 PM IST

Leftover Food : ఇతరుల ఎంగిలి తినొచ్చా ? తినొద్దా ?

ఎంగిలి ఫుడ్ తింటే.. ఏమవుతుంది ?

ఎలాంటి సమస్యలు, ఎలాంటి అరిష్టనాలు ఎదురవుతాయి ? ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఒకరి ఎంగిలిని(Leftover Food) ఇంకొకరు తింటే.. వారి మధ్య సఖ్యత మరింత పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే సఖ్యత సంగతి అలా ఉంచితే.. సమస్యలే ఎక్కువ కలుగుతాయని నిపుణులు అంటున్నారు. ఇతరుల ఎంగిలి తింటే.. వారికి ఉన్న దంతాల ఇన్ఫెక్షన్లు, నోటి ఇన్ఫెక్షన్లు సోకే ముప్పు ఉంటుంది. మనం ఎవరి ఎంగిలి తింటున్నామో.. వారికి  ఏవైనా అంటువ్యాధులు ఉంటే అవి అంటుకునే గండం ఉంటుందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఎంగిలి తినడం వల్ల ఇతరుల గ్రహ దోషాలు కూడా మనకు అంటుకుంటాయని కొందరు జోతిష్య నిపుణులు అంటున్నారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోవడానికి, దురదృష్ట జాతకులుగా మారడానికి ఎంగిలి ఆహారం కారణం అవుతుందని చెబుతున్నారు.

Also read : Sunset: సూర్యాస్తమయం తర్వాత ఈ పనులుచేస్తే అంతే సంగతులు?

కంచానికి త‌గ‌ల‌కుండా వ‌డ్డించాలి..

భోజ‌నాన్ని వ‌డ్డించుకునేట‌ప్పుడు లేదా ఇత‌రుల‌కు వ‌డ్డించేట‌ప్పుడు వ‌డ్డించే ప‌దార్థాల‌ను కంచానికి త‌గ‌ల‌కుండా వ‌డ్డించాలి. కంచానికి త‌గిలేలా వ‌డ్డించ‌డం వ‌ల్ల అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి ప‌దార్థాలను ఎవ‌రికి వడ్డించినా అది దోష‌మ‌వుతుంద‌ని పెద్ద‌లు తెలియ‌జేస్తున్నారు. ఆహార ప‌దార్థాల‌ను వ‌డ్డించేట‌ప్పుడు కొద్దిగా ఎత్తు నుండి వ‌డ్డించాలి. ఎంగిలి చేత్తో ఏ ప‌దార్థాన్ని చూపించ‌కూడ‌దు. తాకరాదు. ఎడ‌మ చేత్తో తినే కంచాన్ని ముట్టుకోరాదు. మాడిపోయిన అన్నాన్ని అతిథుల‌కు వ‌డ్డించ‌కూడ‌దు. ఎవ‌రైనా అతిథులు వ‌చ్చిన‌ప్పుడు మ‌నం తిన‌గా మిగిలిన అన్నాన్ని వారికి వ‌డ్డించ‌కూడ‌దు. వారి కోసం ప్ర‌త్యేకంగా భోజ‌నాన్ని త‌యారు చేయాలి. ఎంత ఆక‌లితో ఉన్నా కూడా గిన్నె మొత్తం ఖాళీ చేయ‌కూడ‌దు. ఎంతో కొంత గిన్నెలో ఉంచాలి. భోజ‌నం చేసిన త‌రువాత నోట్లో నీటిని పోసుకుని పుక్కిలించాలి.

గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.