Site icon HashtagU Telugu

KTR : గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటాం..కేటీఆర్ హామీ

brs-working-president-ktr-meet-group-1-candidates-at-telangana-bhavan

brs-working-president-ktr-meet-group-1-candidates-at-telangana-bhavan

Group-1 Candidates : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను గ్రూప్ 1 అభ్యర్థులు ఈరోజు తెలంగాణ భవన్ ఆయన కలిసారు. జీవో నెంబర్ 29 ను ఎత్తివేయాలని కొందరు అభ్యర్థులు కేటీఆర్ ను కోరారు. ఈ జీవో వల్ల తమకు నష్టం జరుగుతుందని అభ్యర్థులు తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్ ను వాయిదా వేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అభ్యర్థులు కేటీఆర్ కు తెలిపారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తప్పకుండా సహకరిస్తాం అని చెప్పారు. అభ్యర్థులు సుప్రీంకోర్టు కు వెళితే పార్టీ తరుపున అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు.

గ్రూప్-1 మెయిన్స్‌ను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 21 నుంచి జరగనున్న గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు దొర్లాయని, జీవో 29ని సవరించిన తర్వాతే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై దాదాపు 33 కేసులు వచ్చాయని, వాటన్నింటినీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2011లో గ్రూప్-1 పరీక్షలు కూడా నిర్వహించామని, 2016లో రద్దు చేసి మళ్లీ నిర్వహించామని గుర్తు చేశారు.. మెయిన్స్ పరీక్షల్లో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్‌లో అన్ని ప్రశ్నలు తప్పులు లేకుండా ఉన్నాయని, 150 ప్రశ్నల్లో 20 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కేసులన్నింటినీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పలువు అభ్యర్థులు మాట్లాడుతూ జీవో 29, జీవో 55పై ఎటూ తేల్చకుండా, తప్పుడు ప్రశ్నల అంశాన్ని పరిష్కరించకుండా ఆగమేఘాల మీద గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికమో? కాదో? చెప్పకుండా ప్రశ్నల్లో తప్పులు దొర్లకుండా పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇవ్వకుండా, తెలుగు అనువాదం సరిగ్గా ఇస్తారా? లేదా? చెప్పకుండాపరీక్షలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఇవ్వన్నింటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే గ్రూప్‌-2, 3 పరీక్షలు పెట్టలనుకోవడం కూడా నిరుద్యోగులను నిండా ముంచడమేనని మండిపడ్డారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై సుమారు 33 కేసులు దాఖలయ్యాయని, అవన్నీ పరిష్కారమైన తర్వాతే మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. గ్రూప్‌-1 పరీక్షలు 2011లోనూ నిర్వహించి రద్దు చేశారని, 2016లో తిరిగి నిర్వహించారని గుర్తుచేశారు. మెయిన్స్‌ పరీక్షల్లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. గ్రూప్‌-1 పరీక్ష ప్రిలిమ్స్‌లో అన్ని ప్రశ్నలూ తప్పులతడకలేని, 150 ప్రశ్నలకు 20 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని గుర్తుచేశారు. ఈ కేసులన్నీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Read Also: Haryana : హర్యానా సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన నాయాబ్ సైని