PAC meeting : పీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ

PAC meeting : బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఏసీ చైర్మన్ గా అరెకపూడి గాంధీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
BRS party boycotted the PAC meeting

BRS party boycotted the PAC meeting

BRS MLAs and MLCs : అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ ఆరికేపుడి గాంధీ అధ్యక్షతన సమావేశం జరిగింది. అయితే ఈ భేటీకి హాజరైన ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు పీఏసీ ఛైర్మన్ నియామకంపై అభ్యంతరం తెలిపారు. ఈ నియామకాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఏసీ చైర్మన్ గా అరెకపూడి గాంధీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది.

అనంతరం తెలంగాణ భవన్ లో మీడియాతో ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ అధికారంలో వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని పీఏసీ చైర్మన్ గా కేసీఆర్ నియమించారన్నారు. క్రిష్ణారెడ్డి,గీతారెడ్డిని పీఏసీ చైర్మన్లుగా చేశామని… కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కె.సి.వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ అయ్యారని గుర్తు చేశారు. హరీష్ రావు నామినేషన్ ఎందుకు తిరస్కరించారని మేము అడిగామని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచించిన హరీష్ రావును పీఏసీ చైర్మన్ ను చేయాలని…డిమాండ్‌ చేశారు. అరికేపూడి గాంధీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారని చురకలు అంటించారు.

Read Also: RBI Governor : మరోసారి A+ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్

 

  Last Updated: 28 Oct 2024, 02:25 PM IST