Site icon HashtagU Telugu

BRS Maharashtra Victory : మ‌హారాష్ట్రలో బీఆర్ఎస్ బోణీ..ఎక్కడంటే ?

Brs First Victory In Maharashtra

Brs First Victory In Maharashtra

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి బోణీ (Brs Maharashtra Victory) కొట్టింది.  ఔరంగాబాద్ జిల్లా అంబేలోహల్ గ్రామ పంచాయతీకి జరిగిన ఉప ఎన్నికలో వార్డు మెంబర్ గా బీఆర్‌ఎస్ అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ గెలిచారు . తన సమీప ప్రత్యర్థి పై ఆయన 115 ఓట్ల తేడాతో విజయం (Brs Maharashtra Victory) సాధించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో గత నెలలోనే  ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ జరిగింది. అంబేలోహల్ గ్రామం గంగాపూర్ తహసీల్‌ పరిధిలో ఉంది. గ్రామం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,045 హెక్టార్లు. అంబేలోహల్ మొత్తం జనాభా 4,663. 2,421 మంది పురుషులు , 2,242 మంది స్త్రీలు ఉన్నారు. ఈ గ్రామం 62.15 శాతం అక్షరాస్యతను కలిగి ఉంది.