Site icon HashtagU Telugu

Errolla Srinivas : బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు

BRS leader Errolla Srinivas arrested

BRS leader Errolla Srinivas arrested

Errolla Srinivas : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారంటూ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పై బంజారా ‌హిల్స్ లో కేసు న‌మోదైంది. అయితే ఈ కేసు విచార‌ణ‌కు రావాల‌ని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వేస్ట్ మారేడ్‌ప‌ల్లిలోని శ్రీనివాస్ నివాసానికి వెళ్లారు. కానీ, ఆయ‌న త‌లుపులు తెర‌వ‌లేదు. శ్రీనివాస్ ఇంటికి పోలీసులు వ‌చ్చార‌నే విష‌యం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు భారీగా ఆయ‌న ఇంటికి చేరుకున్నారు. అనంత‌రం వారు పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు.

దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని మాసబ్‌ట్యాంక్‌ పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏండ్లపాటు ఉద్యమంలో పాల్గొన్నానని, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా పనిచేశానని చెప్పారు. తెల్లవారుజామున వచ్చి ఇంటి డోర్లు కొట్టడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేస్తున్నదని విమర్శించారు. ప్రశ్నించిన వారిని కాంగ్రెస్‌ సర్కార్‌ వేధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెడుతున్నదని మండిపడ్డారు. ఎన్నికేసులు పెట్టినా, ఎంత నిర్బంధం విధించినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కాగా, పోలీసుల విధుల అడ్డ‌గింత‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు మ‌రికొంత మందిపై గ‌తంలో కేసు న‌మోదైంది. ఈ కేసును మాస‌బ్‌ట్యాంక్ ఇన్‌స్పెక్ట‌ర్ ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read Also: OLA : క్రిస్మస్‌ వేళ.. దేశవ్యాప్తంగా 3200 కొత్త స్టోర్లను ప్రారంభించిన ఓలా