Site icon HashtagU Telugu

Shocking: పెళ్లి కొడుకుకు షాక్ ఇచ్చిన పెళ్లికూతురు.. బంగారం, డబ్బుతో పరార్

38 Lakh Weddings

Wedding Ceremony

కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ అమ్మాయి (Bride) బంగారు ఆభరణాలు, డబ్బుతో పరారైంది. పెళ్లైన ఏడు రోజుల తర్వాత భర్త ఇంటి నుండి పారిపోయింది. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. రసూలాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిరాలా నగర్‌కు చెందిన రామ్ కరణ్ తన ఫిర్యాదులో స్థానికుడు తన పెళ్లిని ఫిక్స్ చేసేందుకు రూ.70,000 తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

“బీహార్‌కి చెందిన అమ్మాయితో నా పెళ్లి (Marriage) నిశ్చయించాడు. డబ్బులు తీసుకున్న తర్వాత మే 15న ధరమ్‌గఢ్ బాబా ఆలయంలో వివాహం జరిపించారు. పెళ్లయ్యాక నేను భార్యతో కలిసి గ్రామానికి వచ్చాను. మే 23న ఆమె ఇంట్లో నుంచి 50 వేల రూపాయల నగదు (Money), బహుమతిగా ఇచ్చిన నగలతో నా భార్య కనిపించకుండాపోయింది’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ రామ్‌ గోవింద్‌ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. పెళ్లి చేసుకొని హాయిగా సంసారం చేసుకోవాలనుకున్న వ్యక్తికి అన్యూహ రీతిలో షాక్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు (Family members) నిరాశలో కూరుకుపోయారు.

Also Read: NBK108 Title: ‘భగవంత్ కేసరి’గా బాలయ్య బాబు.. ‘ఐ డోన్ట్ కేర్’ ట్యాగ్ లైన్ తో!