Site icon HashtagU Telugu

Brave Security Guard : సెక్యూరిటీ గార్డ్ సాహ‌నం.. దోపిడీ దొంగ‌ల‌పై పోరాడి..!

Rob Imresizer

Rob Imresizer

చండీగఢ్: పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఓ సెక్యూరిటీ గార్డు దోపిడీకి వ‌చ్చిన దొంగ‌ల‌ ప్రయత్నాన్ని విఫలం చేశాడు. ఈ సాహ‌సం చేసింది మందర్ సింగ్ అనే సెక్యూరిటీ గార్డ్‌. ముగ్గురు దోపిడీ దొంగ‌ల‌తో పోరాడి వారిని పారిపోయేలా చేశాడు. నిన్న జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ముగ్గురు వ్యక్తులు గార్డును కొట్టడం, పదునైన ఆయుధంతో దాడి చేయడం ఫుటేజీలో కనిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ వారిపై ఒక్క‌డే పోరాడి వాళ్ల‌ని పారిపోయేలా చేశాడు.ఈ ఘ‌ట‌న మోగాలోని దారాపూర్ గ్రామంలో జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. తాము నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని.. సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తామ‌ని స్థానిక పోలీసులు తెలిపారు.

ముగ్గురు నిందితులు మోటర్‌సైకిల్‌పై వచ్చి ముఖాలు కప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులు తమ ముఖాలు కప్పుకుని మోటారుసైకిల్‌పై వచ్చారని.. నేను వారిని ముసుగు విప్పమని అడిగానని సెక్యూరిటీ గార్డ్ తెలిపాడు. దీంతో ఆ ముగ్గురు త‌న‌ చేతిపై క‌త్తితో పోడిచార‌ని.. ఆ త‌రువాత తాను వారిపై పోరాడాన‌ని గార్డ్ తెలిపాడు

 

Exit mobile version