Relationship: ప్రేమించుకుందాం రా.. టీనేజ్ లోనే ప్రేమపాఠాలు, బ్రేకప్ తో చిత్తవుతున్న ఈతరం యూత్!

చినవయసులోనే ప్రేమించుకోవడం వల్ల ఈతరం అబ్బాయిలు, అబ్బాయిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Lovers riding on bike

Lovers

ఈ తరం జనరేషన్ సోషల్ మీడియా, పార్టీలు, పబ్బులు అంటూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే వారంతా ఆనందాల మాటున ఒత్తిడితోనూ చిత్తవుతున్నారు. చిన్న వయసులోనే ప్రేమ పేరుతో రిలేషన్ ను కొనసాగిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయితే తీవ్ర ఒత్తిడితో చిత్తవుతున్నారు. ‘సిగ్నా ఇంటర్నేషనల్ హెల్త్ సర్వే-2023’ ప్రపంచ అధ్యయనం ప్రకారం 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలు, అబ్బాయిలు 91 శాతం మంది ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారు. అయితే యువత ఒత్తిడికి చదువులు, పనిభారం కాదని స్పష్టమైంది. వారంతా తమకు నచ్చిన అమ్మాయి, అబ్బాయి నుంచి విడిపోవడమే కారణమని తెలుస్తోంది. నీల్సన్ ఐక్యూ నిర్వహించిన సర్వేలో, 87 శాతం మంది రిలేషన్ షిప్ సమస్యల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రేమికుడు నుంచి విడిపోతే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడంతో డిప్రెషన్ లోకి వెళ్తున్నారని తెలిసింది.

గుర్గావ్‌లోని పరాస్ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రీతీ సింగ్ మాట్లాడుతూ వారు చిన్న వయస్సులోనే ప్రేమలో పడుతూ రిలేషన్స్ లో ఉంటున్నారట. అయితే ప్రేమికుల మధ్య ఏదైనా విభేదాలు వస్తే రిలేషన్ షిప్ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ బంధం ముందుకు సాగకపోవడంతో ఒంటరిగా మిగిలిపోతున్నారు. డేటింగ్ యాప్ ‘క్వాక్‌క్వాక్’ సర్వే ప్రకారం, అబ్బాయిలు విడిపోవడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. తన బంధాన్ని కొనసాగించడంలో విఫలమవుతుండటం తో క్రమంగా ఒత్తిడితో చిత్తవుతున్నారు. ఇక సోషల్ మీడియా కారణంగా 40 శాతం మంది ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని స్పష్టమైంది.

మానసిక నిపుణుడు డాక్టర్ ప్రీతి మాట్లాడుతూ  ఒంటరితనం అనారోగ్య సమస్యలను పెంచుతుందని చెప్పారు. తల్లితండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే పిల్లలు ప్రేమలో విఫలమైతే ఒంటరితనాన్ని ఎదుర్కొంటూ పెరుగుతారు. చిన వయసులోనే తమకు పార్ట్ నర్ ఉండాలని కలలు కంటున్నారు. అంతేకాదు.. ఆ దిశగా నచ్చినవారితో రిలేషన్స్ లో ఉంటున్నారు. రిలేషన్స్ తో ఉండటం ఫ్యామిలీ, స్నేహితులతో గడపడం తగ్గించుకుంటారు. దీంతో వల్ల ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది.

Also Read: Revanth Reddy Contesting From Kodangal : కొండగల్ నుండి రేవంత్ పోటీ..

  Last Updated: 24 Aug 2023, 03:17 PM IST