Lover Sold: లవర్ ను 2 లక్షలకు ధర కట్టి అమ్మేశాడు.. పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లి దారుణం!!

ప్రియురాలిని ప్రియుడు రూ.2 లక్షలకు ధర కట్టి అమ్మేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Published By: HashtagU Telugu Desk
Crime

Crime

ప్రియురాలిని ప్రియుడు రూ.2 లక్షలకు ధర కట్టి అమ్మేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎలాగోలా తనను కొన్న ముఠా చెర నుంచి ఆ యువతి తప్పించుకొని ఇంటికొచ్చి కుటుంబ సభ్యులకు జరిగిన ఘోరం గురించి చెప్పింది. దీంతో అమానుషంగా ప్రియురాలిని అమ్మేసిన ప్రియుడి వ్యవహారం పై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

ఆ యువతిది ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లా. కానీ బస్తీ జిల్లాలోని తన చిన్నమ్మ ఇంటి దగ్గర ఉండేది. ఈక్రమంలో ఆ ఏరియాలోనే నివసించే అనిల్ అనే వ్యక్తి మాయమాటలతో ప్రేమిస్తున్నానని యువతికి నమ్మబలికాడు. ఆమె నమ్మింది. ప్రేమించడం మొదలుపెట్టింది. ఎన్నోసార్లు అతడు లైంగిక వాంఛను తీర్చుకున్నాడు. ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడల్లా.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటూ తీపి మాటలతో అబార్షన్ చేయించాడు. ఇటీవల ఆమె తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని అనిల్ ను నిలదీసింది. దీంతో అతను ముందుగా ముంబై టూర్ కు వెళ్దాం.. వచ్చాక మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు. చెప్పినట్టే ముంబైకి తీసుకెళ్లాడు.. 15 రోజులు సిటీ అంతా తిప్పాడు. ఒక రోజు జుహూ చౌరస్తాకు తీసుకెళ్లి రోడ్డు పక్కన నిలబెట్టాడు. ఇక్కడే నిలబడు.. ఇప్పుడే వస్తానని పక్కనున్న వీధిలోకి వెళ్ళాడు.ఎంతకూ తిరిగి రాలేదు. కానీ గుర్తు తెలియని యువతి, యువకుడు కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. “మేం నిన్ను 2 లక్షలకు కొన్నాం. మాతో రా” అని చెప్పారు. దీంతో బాధిత యువతి వాళ్ళ వెంట వెళ్ళింది. ఎలాగోలా వాళ్ళ చెర నుంచి తప్పించుకొని ఇంటికి చేరింది. దీంతో వ్యవహారం ప్రపంచానికి తెలిసింది.

  Last Updated: 30 Sep 2022, 12:22 AM IST