Site icon HashtagU Telugu

Tomato : టమాటాల‌కు బౌన్స‌ర్ల ర‌క్ష‌ణ‌..!

Tomato Sales

Tomato Benefits

వీఐపీల‌కు, భారీ ఈవెంట్ల వ‌ద్ద ర‌క్ష‌ణ‌గా ఉండే బౌన్స‌ర్లు ఈ సారి కూర‌గాయాల దుకాణానికి ర‌క్ష‌ణగా ఉన్నారు. అయితే ర‌క్ష‌ణ‌గా ఉంది దుకాణానికి కాదంట‌.. అక్క‌డ ఉన్న ట‌మాటాల‌కు అని వ్యాపారి అంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఒక కూరగాయల వ్యాపారి గత కొన్ని రోజులుగా టమాటాలు కొనడానికి వచ్చినప్పుడు వినియోగదారులను దూరంగా ఉంచడానికి బౌన్సర్‌లను నియమించుకున్నాడు. గ‌త కొద్ది రోజులుగా ట‌మాటాల ధ‌ర వీప‌రీతంగా పెరిగిపోయింది. టమోటా ధర చాలా ఎక్కువగా ఉన్నందున తాను బౌన్సర్లను నియమించుకున్నాన‌ని.. వినియోగ‌దారులు టమోటాలను కూడా దోచుకుంటున్నారని వ్యాపారి తెలిపాడు. ప్ర‌స్తుతం మార్కెట్లో టమాట కిలో రూ.160కి విక్రయిస్తున్నారు. టమాటా దొంగతనాల నివారణకు రైతులు సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్న ఘటనలు కర్ణాటక రాష్ట్రంలోనూ నమోదయ్యాయి. హాసన్ జిల్లాలోని తన పొలంలో రాత్రికి రాత్రే రూ.3 లక్షల విలువైన టమోటాలు దొంగిలించబడ్డాయని ఆరోపిస్తూ ఒక రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హాసన్‌లోని హళేబీడు సమీపంలోని గోని సోమనహళ్లి గ్రామంలో జరిగింది. కిలో రూ.150 దాటడంతో రూ.3 లక్షల విలువైన 90 టమాటా బాక్సులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రెండెకరాల భూమిలో టమోటా సాగు చేయగా, ధరణి చిక్కమగళూరు మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.కానీ ఈ లోపులోనే ట‌మాటాల‌ను దొంగ‌లు ఎత్తుకెళ్లారు. టమాటాల‌ను కాపాడుకునేందుకు రైతులు తమ పొలాల వద్ద పడుకోవలసి వస్తుంది.