Site icon HashtagU Telugu

KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత వాళ్లిద్దరూ కనిపించారు..కేటీఆర్‌

KTR Hot Comments

Both of them appeared after the Lok Sabha elections..KTR

KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మల్కాజిగిరి (Malkajigiri) పార్లమెంట్‌ పరిధిలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మల్కాజిగిరి పార్లమెంట్‌ కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులపై విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్(Etala Rajender), సునీతా మహేందర్ రెడ్డి( Sunita Mahender Reddy) కనిపించరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉంటే.. కవితను జైలులో ఎందుకు వేస్తారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తరప్రదేశ్ లో బీజేపీపై పోరాడలేక రాహుల్ గాంధీ ఆమేథీ నుండి కేరళలోని వయనాడు పోరిపోయారన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి రేవంత్ రెడ్డి కేవలం 5 వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి అన్నీ ఇచ్చిందని.. కానీ ఆయన మాత్రం ఐదేళ్లలో మల్కాజిగిరి కోసం ఏమి చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 10 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే దేశ రాజకీయాలను శాసిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also:Aston Martin Vantage: వామ్మో.. ఈ కారు ధ‌ర ఎంతో తెలుసా..?

కాగా, “ఒకసారి వాళ్లు మోసం చేశారు. రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుంది. పదేళ్లల్లో మల్కాజిగిరికి బీజేపీ ఏం చేసింది? కేసీఆర్ 36 వంతెనలు కడితే ఉప్పల్, అంబర్పేటలో బీజేపీ రెండు వంతెనలు కూడా కట్టలేకపోయింది. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? మనం యాదగిరి గుట్ట కట్టుకోలేదా? దేవుడిని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం లేదు. ప్రజలు సెంటిమెంట్లకు పడిపోకూడదు. మోడీ అక్షింతలు పంపిస్తే కేసీఆర్ దేశం మొత్తానికి బియ్యం పంపించారు.” అని కేటీఆర్ అన్నారు.