Site icon HashtagU Telugu

Bolo Tara Ra: బోలో తార రా రా.. చక్కర్లు కొడుతున్న ‘నో పార్కింగ్’ సాంగ్!

Viral

Viral

భారతదేశంలో చాలా మందికి రోడ్డు పార్కింగ్ రూల్స్ గురించి తెలియదు. తెలిసినా మరికొంతమంది ఏ మాత్రం పట్టించుకోరు. చాలా చోట్లా నో పార్కింగ్ అని హెచ్చరించినా.. రూల్స్ బ్రేక్ చేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా మీమ్స్, జోకులతో ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు పోలీసు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

కానీ చండీగఢ్‌కు చెందిన ఒక ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ రూల్స్ గురించి డిఫరెంట్ గా అవగాహన కల్పిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. దలేర్ మెహందీ స్ఫూర్తితో బోలో తార రా రా అనే పాటతో ట్రాఫిక్స్ రూల్స్ ను తెలియజేస్తున్నాడు. ఆ పాటతోనే నో పార్కింగ్.. అంటూ పాడుతూ నెటిజన్స్ మదిని దోచుకున్నాడు. సింగింగ్ లో దలేర్ మెహందీని మించి పాడటంతో ప్రయాణికులు ‘యూఆర్ అమెజింగ్ సార్’ అంటూ ప్రశంసలు కురిస్తున్నారు. ప్రస్తుతం ఈ కానిస్టేబుల్ పార్కింగ్ పాట ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.

Exit mobile version