Site icon HashtagU Telugu

MK Stalin: స్టాలిన్‌కు ఇష్టమైన భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలుః బీజేపీ చురక

Bjp Says 'happy Birthday, S

Bjp Says 'happy Birthday, S

 

 

MK Stalin:ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు(birthday) సందర్భంగా బీజేపీ(bjp) చైనా భాష మాండరీన్‌(Chinese language Mandarin)లో ఆయనకు శుభాకాంక్షలు(wishes) తెలిపింది. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్‌కు తమిళనాడు బీజేపీ తరఫున ఆయనకు ఇష్టమైన భాష(favourite language)లో పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

తమిళనాడు తూత్తుకుడి జిల్లా(Tamil Nadu Thoothukudi district )కులశేఖరపట్టణంలో ఇస్రో రెండో రాకెట్(ISRO second rocket)లాంచ్ ప్యాడ్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ఇటీవల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు పశుసంవర్ధక శాఖ మంత్రి అనిత రాధాకృష్ణన్ తమిళనాడులోని పలు వార్తా ప్రతికల్లో ప్రభుత్వం తరుఫున ప్రకటనలు ఇచ్చారు. ఇందులో ఇస్రో రాకెట్‌కు చైనా జెండా రంగులు ఉన్నాయి. ఈ ప్రకటనపై తమిళనాడు బీజేపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. ప్రధాని మోడీ సైతం మండిపడ్డారు.

ఇది డిజైనర్ నుంచి జరిగిన పొరపాటు అని మంత్రి అనిత రాధాకృష్ణన్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ దానిని గుర్తు చేస్తూ, చైనా భాషలో ఆయనకు శుభాకాంక్షలు చెప్పింది. బీజేపీ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారి నెట్టింట వైరల్‌గా మారింది.

read also : Search By Date : ​‘సెర్చ్​ బై డేట్’.. వాట్సాప్‌లో మెసేజ్‌లు, ఫైల్స్ వెతకడం ఈజీ