JP Nadda : రాజ్యసభ సభ్యుడిగా జేపీ నడ్డా ప్రమాణం

JP Nadda: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా (JP Nadda) పెద్దల సభకు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. గుజరాత్‌ (Gujarat) రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడిగా (member of Rajya Sabha) శనివారం ప్రమాణం చేశారు. నడ్డాతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ (Jagdeep Dhankar) ప్రమాణం చేయించారు. #WATCH | Delhi: BJP national president JP Nadda takes oath as […]

Published By: HashtagU Telugu Desk
BJP President JP Nadda Takes Oath As Rajya Sabha Member

BJP President JP Nadda Takes Oath As Rajya Sabha Member

JP Nadda: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా (JP Nadda) పెద్దల సభకు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. గుజరాత్‌ (Gujarat) రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడిగా (member of Rajya Sabha) శనివారం ప్రమాణం చేశారు. నడ్డాతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ (Jagdeep Dhankar) ప్రమాణం చేయించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, గతంలో నడ్డా హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం ఈ నెల (ఏప్రిల్‌)తో ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవీకాలం ముగిసిన 57 మంది రాజ్యసభ సభ్యుల్లో ఆయన ఒకరు. దీంతో నెల ముందే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన్ని బీజేపీ ప్రభుత్వం గుజరాత్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Read Also: Telangana Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ ఫై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి సభకు ఎన్నికైన తర్వాత కొత్త పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన 41 మంది అభ్యర్థుల్లో నడ్డా కూడా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆయన పదవీకాలం వాస్తవానికి ఏప్రిల్ 2024లో ముగియాల్సి ఉంది.

  Last Updated: 06 Apr 2024, 09:03 PM IST