Attacks on temples : తెలంగాణలో ఆలయాలపై దాడులను అరికట్టాలని కోరుతూ..గవర్నర్ కి బీజేపీ ఎంపీలు వినతి పత్రాన్ని అందజేశారు. రోజు రోజుకు మత విద్వేషాలు పెరిగిపోతున్నాయని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. అందుకు నిదర్శనం ఇటీవలే సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనే అంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముత్యాలమ్మ ఆలయం గురించి ఎందుకు స్పందించడం లేదని నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే.
తాజాగా ఇవాళ తెలంగాణ బీజేపీ ఎంపీలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను కలిసారు. ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, బీజేపీ శాశస పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గవర్నర్ తో సమావేశమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ఆలయాలపై దాడులను అరికట్టాలని గవర్నర్ ను కోరారు. అనంతరం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ధార్మిక సంఘాల నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వాటిని ఎత్తి వేసేలా చూడాలన్నారు. తెలంగాణలో అసలు నిఘా వ్యవస్థ పని చేస్తోందా అని ప్రశ్నించారు.
కాగా, భావోద్వేగాలకు, పౌర సంక్షేమానికి ఇది ప్రతికూలంగా మారుతుంది. అందుకే, బీజేపీ ఎంపీలు గవర్నర్‌కు వినతి చేస్తూ, ప్రదేశంలో శాంతి, అజేయత, న్యాయాన్ని కాపాడాలనే లక్ష్యంతో తమ పటిష్టతను వ్యక్తం చేస్తున్నారు.