A Strange Cloud: ఆకాశంలో వింత మేఘం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.!

ఆకాశంలో ఓ వింత మేఘం (Strange Cloud) కనువిందు చేసింది. ఈ విచిత్రమైన సంఘటన టర్కీలోని బుర్సా నగరంలో చోటుచేసుకుంది. ఈ మేఘాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. టర్కీలోని బుర్సా నగరంపై ఓ వింత మేఘం కనువిందు చేసింది. UFO ఆకారంలో, గులాబీ రంగులో ఆ మేఘం కనిపించింది.

  • Written By:
  • Updated On - January 21, 2023 / 08:43 AM IST

ఆకాశంలో ఓ వింత మేఘం (Strange Cloud) కనువిందు చేసింది. ఈ విచిత్రమైన సంఘటన టర్కీలోని బుర్సా నగరంలో చోటుచేసుకుంది. ఈ మేఘాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. టర్కీలోని బుర్సా నగరంపై ఓ వింత మేఘం కనువిందు చేసింది. UFO ఆకారంలో, గులాబీ రంగులో ఆ మేఘం కనిపించింది. దీంతో అక్కడి స్థానికులు ఆ మేఘాన్ని కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో క్షణాల్లోనే ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి.ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్.. అచ్చం UFO మాదిరిగానే ఉందని కొందరు అంటుంటే, అచ్చం గులాబీ పువ్వులా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

టర్కీలో భారీ మేఘం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు గురువారం ఈ భారీ మేఘాన్ని చూశారు. ఈ భారీ మేఘం టర్కీలోని వివిధ నగరాల్లో కూడా కనిపించినట్లు నివేదికలు ఉన్నాయి. సమాచారం ప్రకారం.. టర్కీలోని అనేక ప్రాంతాల్లో ఈ వింత మేఘం కనిపించింది. ఈ వీడియోను చూసి చాలా మంది భిన్న రకాలుగా స్పందించారు. కొంతమంది వినియోగదారులు దీనిని తేనెటీగ గొడుగుగా అభివర్ణించారు. కొందరు దీనిని UFO అని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఈ వింత మేఘం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.