Bill Gates: బిల్ గేట్స్ ఫస్ట్ రెజ్యూమ్ చూశారా.. 48 ఏళ్ళ క్రితమే ఆ క్రియేటివిటి?

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌‌గేట్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన మూడవ విలియం హెన్రీ గేట్స్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత, గొప్ప దాతగా కూడా మనందరికీ సుపరిచితమే.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 05:30 AM IST

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌‌గేట్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన మూడవ విలియం హెన్రీ గేట్స్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత, గొప్ప దాతగా కూడా మనందరికీ సుపరిచితమే. మన వ్యక్తిగత ఉపయోగాలకోసం వినియోగించే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులో తెచ్చిన వ్యక్తిగా బిల్ గేట్స్ ఎంతో పేరు పొందాడు. కాగా ప్రస్తుతం బిల్ గేట్స్ ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడుగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈయనప్రపంచవ్యాప్తంగా ఎన్నొ దానాలు, సహాయాలు చేసాడు చేస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే మనం ఎంత చదువు చదివినా కూడా ఉద్యోగం సంపాదించాలి అంటే అందుకోసం మంచి రెజ్యూమ్ ను రూపొందించుకోవాలి. ఏ ఇంటర్వ్యూలకు వెళ్లినా కూడా రెజ్యూమ్ ను ముందుగా అడుగుతూ ఉంటారు. అయితే నిజానికి రెజ్యూమ్ ను ఆకర్షణీయంగా, సూటిగా తయారు చేసుకోవడం అందరికీ సాధ్య పడదు. అది కూడా ఒక కళే చెప్పవచ్చు. అటువంటిది ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ తాను విద్యార్థి దశలో రూపొందించుకున్నాడట. దాదాపుగా 48 ఏళ్ల క్రితం నాటి తన రెజ్యూమ్ ను స్వయంగా బిల్ గేట్స్ లింక్డ్ ఇన్ లో షేర్ చేశారు.

 

Bill Gates

మీరు ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిండొచ్చు లేదంటె కాలేజీ డ్రాపౌట్ కావచ్చు. నేను 48 ఏళ్ల క్రితం తయారుచేసిన రెజ్యూమ్ కంటే మీ రెజ్యూమ్ మెరుగ్గా ఉంటుందని నేను కచ్చితంగా చెప్పగలను అని బిల్ గేట్స్ పోస్ట్ పెట్టారు.ఈ రెజ్యూమ్ రూపొందించుకునే నాటికి బిల్ గేట్స్ హార్వర్డ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కోర్సులో ఉన్నారు. రెజ్యూమ్ ను పరిశీలిస్తే అందులో బిల్ గేట్స్ చేసిన కోర్సుల వివరాలు కనిపిస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్స్ స్ట్రక్చర్, డేటా బేస్ మేనేజ్ మెంట్, కంపైలర్ కన్ స్ట్రక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్సులు చేసినట్టుగా అందులో ఉంది. బిల్ గేట్స్ పూర్తి పేరు అయిన విలియం హెన్రీ గేట్స్ కూడా కనిపిస్తుంది. ఈ రెజ్యూమ్ ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.