Site icon HashtagU Telugu

Biker Viral Video: ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. నెట్టింట్లో వీడియో వైరల్!

Viral

Viral

దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు ఏ క్షణాన ఏంజరుగుతుందో గ్రహించలేదు. మరణం ఏ రూపంలోనైనా రావచ్చు. అందుకే ప్రయాణాల్లో కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. చాలామంది హెల్మట్ కదా.. ఏం కాదులే తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఓ హెల్మెట్ వాహనదారుడి ప్రాణాలు కాపాడింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది.

ఓ వ్యక్తి బైక్ నడుపుతూ రోడ్డుపై ప్రమాదకరంగా స్కిడ్ అయ్యాడు. ఆ వ్యక్తి బైక్‌పై నుంచి ప్రమాదకరంగా కిందపడ్డాడు. అయితే అతనికి ఏమాత్రం దెబ్బలు తగలలేదు. హెల్మెట్ ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. విచిత్రం ఏమిటంటే.. ఆ కొద్దిసేపటికే విద్యుత్ స్తంభం కూడా విరిగిపడి అతనిపై పడింది. ఆ సమయంలోనూ హెల్మెట్ కాపాడింది. ప్రస్తుతం ఈ వీడియోకు 1.4 మిలియన్లకు వ్యూస్ వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.