Site icon HashtagU Telugu

Bihar Woman: ఈ పెళ్లి నాకొద్దు, కళ్యాణ మండపంలో పెళ్లికొడుకును చూసి షాకైన పెళ్లికూతురు!

Marriage

Marriage

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. అందుకే ఈ తరం యూత్ పెళ్లి (Marriage) చేసుకునేముందు ఒకటి వంద సార్లు ఆలోచిస్తున్నారు. ఏజ్, హైట్ ఏదీ తక్కువయినా పెళ్లి చేసుకోవడానికి ఇష్టం చూపలేదు. అరకొర సంపాదన అయిన పర్లేదు. కానీ ఈడుజోడీ బాగాలేకపోతే మాత్రం నో చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిహార్ రాష్ట్రంలోని బాగల్ పురలోని ఓ మారుమూల గ్రామంలో విచిత్ర ఘటన ఒకటి చోటుచేసుకుంది.

తెల్లారితే పెళ్లి.. కళ్యాణ మండపం అందంగా ముస్తాబైంది. బంధు మిత్రులు కుర్చీల్లో కుర్చొని పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. అందరూ ఆనందంతో పెళ్లి వేడుకల్లో మునిగిపోయారు. అప్పుడు ఉరేగింపుగా గుర్రం మీద వచ్చాడు కొత్త పెళ్లి కొడుకు (Groom). కళ్యాణ మండపంలోని స్టేజీకి వచ్చాక అబ్బాయి మెడలో దండ వేసింది అమ్మాయి. కానీ ఆ తర్వాత బొట్టు పెట్టకుండా అలిగికూర్చుంది. ఏమైందని అడగ్గా.. ‘‘ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. అబ్బాయి నల్లగా ఉన్నాడు.

వయసు కూడా చాలా పెద్దగా ఉంది. ఇలాంటబ్బాయిని నేను పెళ్లి చేసుకోలేను’’ అని తేల్చి చెప్పడంతో అందరు షాక్ అయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు మెప్పించినా అమ్మాయి మాత్రం నో అనే అంటోంది. బలవంతంగా పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో చేసేదేమీ లేక పెళ్లి క్యాన్సిల్ (Cancelled) చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: Health Survey: మహిళల్లో అధిక కొవ్వు.. ఆరోగ్యానికి తీవ్ర ముప్పు!

Exit mobile version