Bihar by-elections : రాజకీయ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరాజ్ పార్టీ బీహార్ ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జన్ సూరాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థులందరూ వారి వారి స్థానాల నుండి అత్యంత దారుణంగా ఓడిపోవడం జరిగింది. జన్ సూరాజ్ పార్టీ వరుసగా ఇమామ్‌గంజ్, బెలగంజ్, రామ్‌గఢ్, తరారీ నియోజకవర్గాల నుంచి జితేంద్ర పాశ్వాన్, మహ్మద్ అమాజద్, సుశీల్ కుమార్ సింగ్, కిరణ్ సింగ్‌లను పోటీకి దింపింది.
కాగా, అక్టోబరు 2న ప్రశాంత్ కిషోర్ తన పార్టీని ప్రారంభించినప్పుడు..2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతానని చెప్పాడు. అయితే ఈలోపు నాలుగు ఉప అసెంబ్లీ స్థానికులకు ఎన్నికలు జరగడంతో, తన పార్టీ అభ్యర్థులను బరిలో దించారు. బీహార్ ఉపఎన్నికల్లో జన్ సురాజ్ నిలబెట్టిన అభ్యర్థులు ఎవరూ ప్రత్యర్థులతో గట్టి పోరులో లేకపోవడంతో భారీ తేడాతో ఓడిపోయారు. బీజేపీ రామ్‌గఢ్ మరియు తరారీలను గెలుచుకోగా, బెలగంజ్ మరియు ఇమామ్‌గంజ్ వరుసగా JDU మరియు హిందుస్థానీ అవామ్ మోర్చా గెలుచుకున్నాయి. బెలగంజ్ నుంచి ప్రశాంత్ కిషోర్ అభ్యర్థిగా మహ్మద్ అమ్జాద్‌ను బరిలోకి దింపగా, అతనికి 17,285 ఓట్లు వచ్చాయి. ఈ స్థానం నుంచి జేడీయూ అభ్యర్థి మనోరమా దేవి 73,334 ఓట్లతో విజయం సాధించారు.
ఇమామ్‌గంజ్‌లో ప్రశాంత్ కిషోర్ మూడో స్థానంలో నిలిచిన జితేంద్ర పాశ్వాన్‌కు టికెట్ ఇచ్చారు. ఆయనకు 37,103 ఓట్లు వచ్చాయి. ఈ స్థానం నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర రామ్ మాంఝీ కోడలు దీపా మాంఝీ 53,435 ఓట్లతో విజయం సాధించారు. రామ్‌గఢ్‌లో, జన్ సూరాజ్‌కు చెందిన సుశీల్ కుమార్ సింగ్ పోటీలో ఉన్నారు, కానీ నాల్గవ స్థానంలో నిలిచారు. ఆయనకు 6,513 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్ 62,257 ఓట్లు సాధించారు. తరారీలో కిరణ్ సింగ్‌ను ప్రశాంత్ కిషోర్ పోటీకి నిలబెట్టగా, ఆమె 5,592 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సునీల్ పాండే కుమారుడు విశాల్ ప్రశాంత్ 78,564 ఓట్లు సాధించారు.
Read Also: Gift Deeds : ‘గిఫ్ట్ డీడ్లు’ రాసిచ్చేస్తున్న భూ యజమానులు.. కారణాలు ఇవీ