Viral Pic : రోగికి హిందీలో మందులు రాసిన డాక్టర్…వైరల్ అవుతోన్న ప్రిస్క్రిప్షన్ ..!!

సాధారణంగా వైద్యులు ప్రిస్కిప్షన్ ఇంగ్లీష్ లో రాస్తుంటారు. వారు రాసేది...ఒక మెడికల్ షాపు సిబ్బందికి తప్పా ఇంకెవరికీ అర్థం కాదు.

  • Written By:
  • Publish Date - October 17, 2022 / 10:41 AM IST

సాధారణంగా వైద్యులు ప్రిస్కిప్షన్ ఇంగ్లీష్ లో రాస్తుంటారు. వారు రాసేది…ఒక మెడికల్ షాపు సిబ్బందికి తప్పా ఇంకెవరికీ అర్థం కాదు. అయితే మధ్యప్రదేశ్ లోని సత్నాలో గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. దానిపై రోగిపేరు, మందుల పేరుతోపాటు పైనా శ్రీహరి అని రాసి ప్రిస్కిప్షన్ రాశారు. కాగా మధ్యప్రదేశ్ లో హిందీభాషపై ప్రచారం జరుగుతోంది. ఎంతలా అంటే హిందీలోనే ఇంజనీరింగ్ , మెడికల్ చదువులు సాగే రాష్ట్రంగా మారిపోయింది. వైద్య కోర్సులకు సంబంధించిన హిందీ పుస్తకాలను కేంద్రమంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అంతకుముందు జరిగిన ఓ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహన్ మాట్లాడుతూ…ప్రిస్క్రిప్షన్ లో హిందీలో మందుల పేర్లు ఎందుకు రాయడంలేదని వైద్యులను అడిగారు. హిందీలో సమస్య ఏంటీ…హిందీలో క్రోసిన్ అని రాయవచ్చు కదా. ప్రిస్క్రిప్షన్ రాసేముందు శ్రీహరి అని రాసి..కిందమందుల పేర్లు రాయండంటూ సూచించారు.

ఇప్పుడు సాత్నా జిల్లాలోని కోటూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు నర్వేష్ సింగ్ హిందీలో మందులు రాయడం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆదివారం కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి డాక్టర్ ఓపిడి స్లిపై మందులు రాసారు.