హాథ్రస్ తొక్కిసలాట (Hathras Stampede)లో 121 మంది మృతికి కారణమైన భోలే బాబా అలియాస్ సూరజ్ పాల్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులకు ఆయన గురించి షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. బయటకు తెల్లటి దుస్తులు వేసుకొని కనిపించే బాబా..లోపల మాత్రం మంచి రసికుడు అట..ఈయన కోర్కెలు మాములు కోర్కెలు కావు.. బాబా చుట్టూ నిత్యం వర్జిన్ గర్ల్స్ (కన్యలు) మాత్రమే ఉండేవారట. వాళ్లు ఎరుపు దుస్తులు ధరించి ఆయనకు స్నానం చేయించి, భోజనం కూడా తినిపించేవారట..ఇంతేకాదు ఈయన గురించి మరిన్ని విషయాలు బయటకు వస్తూ అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
భోలే బాబా (Bhole Baba)..ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. వారం క్రితం వరకు కూడా భోలే బాబా అంటే పెద్దగా ఎవరికీ తెలియదు..అసలు ఎవరు పట్టించుకోలేదు..కానీ ఎప్పుడైతే..హత్రాస్‌లో (Hathras Stampede) జరిగిన తొక్కిసలాట 121 మందికి చావుకు కారణమయ్యాడో.. అంత ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య జైలు కు వెళ్లి వచ్చిన వారంతా బాబా అవతారం ఎత్తి కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ భోలే బాబా కూడా అంతే. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయన..చదు పూర్తి చేసుకున్నాక.. 18 సంవత్సరాల పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసాడు. ఆ తర్వాత వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్) తీసుకుని, ఆధ్యాత్మిక బాట పట్టాడు. పోలీసు శాఖలో పని చేసే సమయంలోనే ఆయనపై లైంగిక వేధింపుల కేసులో నమోదు కావడం తో జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత నారాయణ్ సాకార్ విశ్వహరి బాబాగా పేరు మార్చుకొని , తన పూర్వీకుల గ్రామంలో ఓ ఆశ్రమాన్ని తెరించి జనాలను ఆకర్షించడం మొదలుపెట్టారు. అలా గత కొన్ని ఏళ్లుగా ఆశ్రమం నడిపిస్తూ దాదాపు రూ.100 కోట్లు వెనకేసుకున్నాడు. రీసెంట్ గా హాథ్రస్ తొక్కిసలాటలో 121 మంది మరణించడంతో భోలే బాబా హాట్ టాపిక్ అయ్యారు.
అందరి బాబాల్లాగే సమాజాన్ని ఉద్దరిస్తున్నట్లు బయటకు కనిపించే భోలే బాబా తన సామ్రాజ్యంలో రాజా భోగాలు అనుభవించడంకోసం కన్యపిల్లలతో సేవ చేయించుకుంటాడట. నిత్యం అతని చుట్టూ ఉండే వర్జిన్ గర్ల్స్ అందరూ రెడ్ కలర్ దుస్తులు ధరించి ఆయనకు నగ్నంగా స్నానం చేయిస్తారట. అంతేకాదు కన్య పిల్లలు తినిపిస్తేనే భోజనం చేసి, వారు పక్కనుంటేనే నిద్రిస్తారట భోలే భాబా. ఇక వివాహితలను మాత్రం తన దారిదాపుల్లోకి రానివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తారట. పెళ్లైన స్త్రీలు కనీసం తన ఆశీస్సులు తీసుకునేందుకు కూడా అనుమతించరని స్థానికులు చెబుతున్నారు. భోలే బాబా ఆశ్రమంలో కేవలం మహిళా భక్తులకే ప్రవేశం ఉంటుంది. స్థానికులు బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే బాబా అనుచరులు దాడులు చేస్తారని గ్రామస్థులు చెపుతున్నారు. ఇక పదేళ్ల క్రితమే ఆశ్రమం కోసం గ్రామస్థుల భూమిని భోలే బాబా కొనుగోలు చేసినట్లు అక్కడి పంచాయితీ వార్డు మెంబరు పూల్ సింగ్ యాదవ్ మీడియాకు తెలిపారు. మరి రాబోయే రోజుల్లో ఈ బాబా గురించి ఇంకెన్ని విషయాలు తెలుస్తాయో చూడాలి.
Read Also : Ram Charan Cars : రామ్ చరణ్ దగ్గర మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? వాటి విలువ కోట్లల్లో..