Site icon HashtagU Telugu

Rs 750 Cashback : యూపీఐ యూజర్లకు ఈజీగా రూ.750 క్యాష్‌బ్యాక్

Rs 750 Cashback

Rs 750 Cashback

Rs 750 Cashback : డిజిటల్ పేమెంట్ యాప్ BHIM యూజర్స్‌ను తన వైపు ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.  యూజర్లు చేసే ట్రాన్సాక్షన్లపై రూ.750 దాకా క్యాష్‌బ్యాక్ ఇస్తామని ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ BHIM యాప్‌తో లింక్ అయిన ప్రాథమిక బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది. BHIM యాప్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు 2024 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎలాంటి పేమెంట్లపై ఎంత క్యాష్‌బ్యాక్(Rs 750 Cashback) పొందొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

ఫుడ్, ట్రావెల్ పేమెంట్స్ చేస్తారా ?

BHIM యాప్ ద్వారా ఫుడ్, ట్రావెల్ ఖర్చుల కోసం రూ.100 లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్స్ చేసిన ప్రతిసారీ రూ.30 దాకా క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. రైల్వే టిక్కెట్ల బుకింగ్, క్యాబ్‌లో ప్రయాణించడం, రెస్టారెంట్ బిల్లులపై ఈ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఈ ఆఫర్‌ను గరిష్టంగా ఐదు సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం రూ.150 దాకా క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

రూపే క్రెడిట్ కార్డ్ ఉందా ?

మీ దగ్గరున్న రూపే క్రెడిట్ కార్డ్‌ను BHIM యాప్‌కు లింక్ చేయొచ్చు. ఆ కార్డు నుంచి పేమెంట్స్ చేస్తే రూ.600 ఎక్స్‌ట్రా క్యాష్‌బ్యాక్‌ను అందుకోవచ్చు. రూపే క్రెడిట్ కార్డ్ యూజర్లకు తొలి 3 లావాదేవీలపై రూ.100 దాకా క్యాష్‌బ్యాక్ వస్తుంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ రూ.100 లేదా అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లకే లభిస్తుంది. మొదటి మూడు లావాదేవీల తర్వాత ప్రతి నెలా చేసే రూ.200 లేదా అంతకంటే ఎక్కువ తదుపరి 10 లావాదేవీలపై రూ.30 దాకా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలా రెండు నెలల పాటు చేసి మొత్తం రూ.600 క్యాష్‌బ్యాక్‌‌ను అందుకోవచ్చు. అయితే గడువుకు ముందే అన్ని లావాదేవీలను పూర్తి చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఫ్యూయల్, యుటిలిటీ బిల్లులు పే చేస్తున్నారా ?

BHIM యాప్ అన్ని ఫ్యూయల్, యుటిలిటీ బిల్లు పేమెంట్స్‌పై 1 శాతం దాకా క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ,  ఎలక్ట్రిసిటీ, వాటర్‌, గ్యాస్ బిల్లులపై 1 శాతం దాకా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే రూ.100 లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులపైనా క్యాష్‌బ్యాక్ దక్కుతుంది.

Also Read :Paytm Update : తగ్గేదేలే అంటున్న పేటీఎం.. ఏం చేయబోతుందో తెలుసా ?

Exit mobile version