Jeff Bezos : రూ.75వేల కోట్ల షేర్లు అమ్మేస్తా.. అపర కుబేరుడి ప్రకటన

Jeff Bezos : జెఫ్ బెజోస్ .. అపర కుబేరుడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఈయన నంబర్ 2 ర్యాంకులో ఉన్నారు.

  • Written By:
  • Updated On - February 3, 2024 / 09:18 AM IST

Jeff Bezos : జెఫ్ బెజోస్ .. అపర కుబేరుడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఈయన నంబర్ 2 ర్యాంకులో ఉన్నారు. బెజోస్ మొత్తం సంపద విలువ రూ.15 లక్షల కోట్లు. ఈయనకు చెందిన అమెజాన్ కంపెనీ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2025 జనవరి 31లోగా అమెజాన్ కంపెనీలోని తనకు చెందిన 5 కోట్ల షేర్లను అమ్మేస్తానని బెజోస్(Jeff Bezos) అనౌన్స్ చేశారు. అమెజాన్ కంపెనీకి చెందిన ఒక షేరు విలువ 15వేల రూపాయలు.  ఈ లెక్కన షేర్ల అమ్మకం ద్వారా దాదాపు రూ.75వేల కోట్లు జెఫ్ బెజోస్ జేబులోకి వస్తాయి. అమెజాన్ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, క్లౌడ్ సేవల వ్యాపారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. దీంతో దాని షేర్లు లాభాల బాటలో నడుస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

1994లో అలా మొదలైంది.. 

బెజోస్ 1994 సంవత్సరంలో అమెజాన్‌ను ఆన్‌లైన్‌లో పుస్తకాల విక్రయ ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభించారు.  జెఫ్‌ బెజోస్‌, ఆయన మాజీ భార్య మెకంజీ స్కాట్‌లు కలిసి అప్పట్లో అమెరికాలోని సియాటెల్‌లో ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నారు. మూడు బెడ్‌రూమ్‌లున్న ఆ ఇంటినే కార్యాలయంగా మార్చుకొని ఆన్‌లైన్‌లో పుస్తకాలను విక్రయించడం మొదలుపెట్టారు. ఓ కంప్యూటర్‌, ఒక డెస్కు, చిన్న ఆఫీసుకు అవసరమైన సామగ్రి మాత్రమే ఉండేవి. ఆ ఇంటికి బెజోస్‌ నెలకు రూ.80వేలు అద్దె చెల్లించేవారట. అమెజాన్‌ మొదట్లో కేవలం పుస్తకాలను మాత్రమే విక్రయించేది. అనంతరం కొన్నేళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్‌ను సొంతం చేసుకొని పలు రంగాల్లో దూసుకెళ్తోంది. దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్‌.. ప్రస్తుత మార్కెట్‌ విలువ 1.6 ట్రిలియన్‌ డాలర్లుగా అంచనా. ప్రపంచంలోనే ఐదో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.

Also Read : India vs Pakistan : ఇండియా వర్సెస్ పాక్.. 60ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అమీతుమీ

జెఫ్ బెజోస్ నంబర్ 2 లెక్కలివీ.. 

ట్విట్టర్(ఎక్స్), టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీల  అధినేత ఎలాన్ మస్క్ జనవరి 29న ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారు. లగ్జరీ గూడ్స్ కంపెనీ లూయిస్ విట్టన్ బాస్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి స్థానానికి ఎగబాకారు. అయితే మరుసటి రోజే వెలువడిన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..  ప్రపంచ కుబేరుడి స్థానాన్ని ఎలాన్ మస్క్ తిరిగి ఆక్రమించారు. దీని ప్రకారం ప్రస్తుతం మస్క్ దగ్గర ఏకంగా 204 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ. 17 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఆర్నాల్ట్ సంపద 183 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 186 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. 183 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ మూడో స్థానానికి పడిపోయారు. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ 145 బిలియన్ డాలర్లతో ఈ లిస్ట్‌లో నాలుగో స్థానంలో ఉండగా.. మెటా బాస్ మార్క్ జుకర్‌బర్గ్ 145 బిలియన్ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. భారత దిగ్గజ వ్యాపారవేత్తలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 108 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. ఇక అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 95.9 బిలియన్ డాలర్లతో 14వ స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అంబానీ, అదానీ ఇద్దరి ఉమ్మడి సంపద కూడా మస్క్ సంపద కంటే తక్కువగానే ఉంది.