Unmarried Boys: పెళ్లి కాని అబ్బాయిలు.. జర జాగ్రత్త!

వ్యక్తిగత లక్ష్యాలు, ఇతర కారణాలు ఏమైనాకానీ అబ్బాయిలు సరైన భాగస్వామిని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు.

  • Written By:
  • Updated On - December 2, 2022 / 02:48 PM IST

వ్యక్తిగత లక్ష్యాలు, ఇతర కారణాలు ఏమైనాకానీ అబ్బాయిలు సరైన భాగస్వామిని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇక అమ్మాయిలు తగిన ఈడు జోడు అంటూ కాలయాపన చేస్తూ పెళ్లి ముచ్చటను దాటవేస్తున్నారు. అయితే ఇలాంటివారి కోసమే డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోని సైట్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు ఈ తరం యూత్.  దీనే ఆసరగా చేసుకొని సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. స్కామ్ స్టర్స్ పెళ్లి కాని అబ్బాయిలను టార్గెట్ గా చేసుకొని సైబర్ క్రైమ్స్ కు పాల్పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది మోసపోయినట్టు చాలామంది యూత్ పోలీసులను ఆశ్రయించారు. వందల కోట్ల మేర మోసం చేసినట్లు తెలుస్తోంది.

కొంతమంది మోసగాళ్లు మ్యాట్రిమోనీ సైట్‌లలో నకిలీ ప్రొఫైల్స్ తో వల వస్తున్నారు. తాను అమెరికాలో ఉన్నానని, హైయర్ స్టడీస్ కోసం ఫారిన్ లో ఉంటున్నానని పరిచయాలు పెంచుకుంటున్నారు. ప్రేమ పేరుతో అందమైన అమ్మాయిలను రంగంలోకి దింపి అబ్బాయిలను  టార్గెట్ చేస్తున్నారు. ఈ ఇష్యూ పోలీసులకు చేరడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని,  పెళ్లికాని అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు పోలీసులు కోరుతున్నారు.

ఒంటరి మహిళలు, పెళ్లి కాని యువకులు, విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నవారిని టార్గెట్​ చేస్తున్నారు. నకిలీ వివాహ పరిచయ వేదికలను ఏర్పాటు చేసి వారి దగ్గర నుంచి సొమ్ము కాజేస్తున్నారు. పార్కుల్లో బహిరంగ ప్రదేశాల్లో పెళ్లి చూపులు అరెంజ్ చేస్తామని నమ్మబలికి కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు.  పెళ్లికి రిజిస్ట్రేషన్ చేసుకున్న అబ్బాయిలను ప్రలోభ పెడతారు ఇంకొందరు మహిళలు. ఫీజుల పేరుతో మూడు వేల రూపాయలు తీసుకునేవారు. తర్వాత అమ్మాయిల ఫొటోలను పంపించి వారిని బుట్టలో వేసుకునే వారు. ఆ తర్వాత అబ్బాయిల నుంచి రకరకాల పేర్లు చెప్పి దఫదఫాలుగా డబ్బులు తీసుకుంటారు. అవతలి వ్యక్తి గట్టిగా నిలదీస్తే ఆ నెంబర్‌ను బ్లాక్ చేస్తారు. పెళ్లి సీజన్ మొదలుకావడంతో ఇలాంటి రకమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.