Rejected 13 Job Offers : ఆమె 13 జాబ్ ఆఫర్స్ కు నో చెప్పింది.. ఆ తర్వాత ఏమైందంటే ?

Rejected 13 Job Offers : మంచి జీతంతో మంచి ఉద్యోగం సంపాదించాలనే డ్రీమ్ ఎవరికి మాత్రం ఉండదు. అలాంటిది.. రీతీకుమారి అనే యువతికి  21 ఏళ్ల ఏజ్ లోనే 13 జాబ్ ఆఫర్స్ వచ్చాయి..

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 04:52 PM IST

Rejected 13 Job Offers : మంచి జీతంతో మంచి ఉద్యోగం సంపాదించాలనే డ్రీమ్ ఎవరికి మాత్రం ఉండదు. అలాంటిది.. రీతీకుమారి అనే యువతికి  21 ఏళ్ల ఏజ్ లోనే 13 జాబ్ ఆఫర్స్ వచ్చాయి.. ఇప్పుడు వస్తున్న  ఉద్యోగం కంటే.. ఫ్యూచర్ ను నిర్మించే  కెరీరే ముఖ్యమని ఆమె భావించింది. అందుకే క్యూ కట్టి తన ముందు వాలిన జాబ్ ఆఫర్స్ కు సింపుల్ గా నో చెప్పింది. TCS, Infosys, Wipro వంటి కంపెనీల జాబ్ ఆఫర్లకూ ఆమె ఓకే చెప్పలేదు. వీటిలో ఒక కంపెనీ ఏకంగా రూ.17 లక్షల వార్షిక శాలరీ ప్యాకేజీ ఇచ్చినా రీతీకుమారి జాబ్ లో జాయిన్ కాలేదు.. కానీ రూ.85,000 స్టైఫండ్ తో వాల్‌మార్ట్‌ ఇచ్చిన  6 నెలల ఇంటర్న్‌షిప్ ఆఫర్ కు ఓకే చెప్పింది. ఈ నిర్ణయమే ఆమెకు గ్రాండ్ సక్సెస్ ఇచ్చింది.. రీతీకుమారి ఇప్పుడు ఏడాదికి రూ. 20 లక్షలకుపైనే సంపాదిస్తోంది.

Also read : Tamilnadu: పెళ్ళై నెల కాకుండానే అలాంటి పనిచేసిన వరుడు.. స్మశానవాటికకు వెళ్లి అలా?

ఓ మీడియా సంస్థతో రీతీకుమారి మాట్లాడుతూ.. “13 జాబ్స్ కు నేను నో చెప్పినప్పుడల్లా(Rejected 13 Job Offers)   మా పేరెంట్స్ చాలా బాధపడ్డారు. మళ్ళీ  జాబ్ ఆఫర్ వస్తుందో రాదోనని వాళ్లు టెన్షన్ పడేవారు. నాకు వాల్‌మార్ట్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ వచ్చినప్పుడు నేనైతే చాలా సంతోషించాను. వెంటనే అందులో చేరాలని నిర్ణయించుకున్నాను. ఓ వైపు 13 జాబ్ ఆఫర్స్ .. మరోవైపు  వాల్ మార్ట్ ఇంటర్న్ షిప్  నా ముందు ఉన్నాయి.  స్టెబిలిటీ, రిస్క్‌ల మధ్య ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం చాలా కష్టమని ఆ  టైంలో అనిపించింది ! నాకు ఎవరూ సపోర్ట్ చేయని ఆ టైంలో మా సోదరి నన్ను ప్రోత్సహించింది. జాబ్ ఆఫర్స్ ను యాక్సెప్ట్ చేయడం  కంటే ఇంటర్న్ షిప్ లో చేరి  స్కిల్స్ ను పెంచుకోవడమే మంచిదని సలహా ఇచ్చింది. దాన్ని ఫాలో అయ్యాను.  ఇంటర్న్ షిప్ తర్వాత వాల్‌మార్ట్ వాళ్ళు నాకు జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు నా సక్సెస్‌తో మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. మా నాన్న నేను చదివిన స్కూల్‌లోనే టీచర్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన నన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నారు” అని వివరించింది .