Rat Damage : చూడటానికి చిట్టీ ఎలుక.. అది చేసిన పనే రూ.5 లక్షలు పరిహారం కట్టేలా?

మామూలుగా మనం నివసించే ఇళ్ళలో ఎలుకలు వచ్చాయి అంటే వాటిని ఇంటి నుంచి తరిమిమేస్తూ ఉంటాము.

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 08:00 PM IST

మామూలుగా మనం నివసించే ఇళ్ళలో ఎలుకలు వచ్చాయి అంటే వాటిని ఇంటి నుంచి తరిమిమేస్తూ ఉంటాము. అందుకు గల కారణం అవి ప్రతి ఒక వస్తువుని నాశనం చేస్తాయి అని. అయితే ఎలుక చేసే అల్లరి వల్ల చాలా నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఎలుకలు ఎక్కువగా ఇళ్లలో, బొరియల్లో నివసిస్తూ ఉంటాయి. ఇక ఇవి ఇళ్లలోకి చొరబడ్డాయి అంటే ఇంక అంతే సంగతులు. వాటిని పట్టుకోవడానికి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది. అవి వారికి కనిపించిన ప్రతి ఒక్క వస్తువుని కొరికేస్తూ ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటాయి.

ఆ ఎలుకలు చూడటానికి చిన్నగా ఉన్నా అవి సృష్టించే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా బెంగళూరు లోని ఒక అపార్ట్మెంట్ లో ఎలుక ఇలాగే ఒక పెద్ద రగడను తెచ్చిపెట్టింది. ఒక కారులో వైరును కొరికేయడంతో ఆ కారు యజమాని తనకు 5లక్షల పరిహారం ఇవ్వాలి అంటూ అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిని డిమాండ్ చేశాడు. అలా వారి గొడవ చిలికి చిలికి గాలివానగా మారి పోలీస్ స్టేషన్ లి కేసు వరకు వెళ్ళింది. పూర్తి వివరాలు.. బెంగుళూరు నగరంలోని గంగానగరలో కంఫర్ట్ ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్ ఉంది.

ఆ అపార్ట్మెంట్ లో చెత్త పేరుకుపోవడంతో ఎలుకల గోల అధికమయింది. ఈ క్రమంలోనే అక్కడ పార్కు చేసిన ఒక కారు వైర్లను ఒక ఎలుక కొరికేసింది. దీనితో ఆ కారు యజమాని చెత్త తొలగించకపోవడం వల్లే ఈ ఎలకల బెడద వచ్చిందని, ఈనెల క్షణానికి అపార్ట్మెంట్ అసోసియేషన్ కారణం అంటూ పెద్ద గొడవ చేశారు. ఈ గొడవ మరి కాస్త పెద్దది అవడంతో ఇతర ఫ్లాట్ల వారు కూడా ఆ కారు యజమాని పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పరిహారం ఇవ్వాలి అంటూ వారిని ఇబ్బందికి గురి చేస్తున్నట్లు తెలిపారు.