Hyderabad : మండుతున్న ఎండ‌లు.. 17 రోజుల్లో కోటి బీర్లు తాగేసిన..!

గ‌త కొద్దిరోజులుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. ఉద‌యం 10 గంట‌ల త‌రువాత బ‌య‌టికి రావాలంటే

  • Written By:
  • Publish Date - April 19, 2023 / 08:28 AM IST

గ‌త కొద్దిరోజులుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. ఉద‌యం 10 గంట‌ల త‌రువాత బ‌య‌టికి రావాలంటే న‌గ‌ర‌వాసులు భ‌య‌ప‌డుతున్నారు. అసాధారణంగా పెరుగుతున్న ఎండలు హైదరాబాద్ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బాడీ కూలింగ్ కోసం మందుబాబులు బీర్ల‌పై ఆస‌క్తి చూపుతున్నారు. ఈ నెలలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ నెల 1 నుంచి 17 వరకు నగరంలో ఏకంగా 1.01 కోట్ల బీర్లు అమ్ముడైనట్టు ఎక్సైజ్ శాఖ లెక్క‌లు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నట్టు ఆబ్కారీ శాఖ పేర్కొంది. ఈ మూడు జిల్లాల్లో కలిపి ఈ నెల 17 వరకు మొత్తం 8,46,175 కేసుల బీర్లు అమ్మడుపోయాయి. ఒక్కో కేసులో 12 బీర్లు ఉంటాయి. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం 10,154,100 బీర్లు అమ్ముడుపోయాయి. అలాగే, ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో బీర్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. నెలకు సగటున లక్ష బీరు కేసులు అదనంగా అమ్ముడవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో భారీగా ఎక్సైజ్ శాఖ‌కు ఆదాయం చేకురుతుంది.