Site icon HashtagU Telugu

Sania Divorce : షోయబ్‌తో విడాకులు.. సానియా ఫ్యామిలీ ప్రకటన ఇదీ..

Divorce Rumours

Sania Mirza

Sania Divorce : విడాకుల సంగతి చెప్పలేదు కానీ.. ఏకంగా సనా జావెద్‌తో రెండో పెళ్లి ఫొటోలను సానియా మీర్జా భర్త,  పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడుదల చేయడం సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వారిద్దరూ విడాకులు తీసుకున్న అంశంపై  తొలిసారిగా సానియా ఫ్యామిలీ స్పందించింది.  ‘‘సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టి నుంచి దూరంగా ఉంచే ప్రయత్నమే చేసింది. కొన్ని నెలల క్రితమే షోయబ్, సానియా విడాకులు తీసుకున్నారు. దాని గురించి ప్రకటన చేయాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. అందుకే ఇప్పుడు దాని గురించి చెబుతున్నాం.  షోయబ్ కొత్త ప్రయాణానికి సానియా శుభాకాంక్షలు తెలిపింది. సానియా జీవితంలోని సున్నితమైన ఈ అంశం విషయంలో అభిమానులు, శ్రేయోభిలాషులందరూ ఊహాగానాలకు తావివ్వకూడదని మా వినతి. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల గోప్యతకు సంబంధించిన అవసరాన్ని అందరూ గ్రహించాలని మేం కోరుతున్నాం’’ అని సానియా మీర్జా ఫ్యామిలీ(Sania Divorce) ఓ ప్రకటనలో తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షోయబ్ మాలిక్ నుంచి సానియా మీర్జా ఖులా తీసుకుంది. ఖులా అనేది ఒక ముస్లిం మహిళ తన భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కును కల్పిస్తుంది’’ అని వెల్లడించారు. సానియా, షోయబ్‌కు వివాహ జీవితంలో ఒక కుమారుడు కలిగాడు. అతడి పేరు ఇజాన్. వయసు ఐదేళ్లు. ఈ అబ్బాయి ఇప్పుడు తన తల్లితోనే ఉంటాడు. షోయబ్, సానియా మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలే వారు విడిపోవడానికి దారితీశాయని 2022 సంవత్సరం నుంచే బలమైన పుకార్లు వినిపిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలలో వీరిద్దరు కలిసి కనిపించిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా మీర్జాను షోయబ్ మాలిక్ అన్‌ఫాలో చేశాడు.షోయబ్, సానియా 2010 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ దుబాయ్‌లో నివసించేవారు. ఇక షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్న సనా జావేద్‌ బ్యాక్ గ్రౌండ్‌లోకి వెళితే..  2020లో ఆమెకు సింగర్ ఉమైర్ జైస్వాల్‌‌తో పెళ్లయింది. రెండు నెలల క్రితమే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆమె షోయబ్‌ను పెళ్లాడింది.

Also Read: Hindi In US Schools : అమెరికాలోని గవర్నమెంట్ స్కూళ్లలో ఇక హిందీ భాష