Site icon HashtagU Telugu

Congress: కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌.. పార్టీని వీడుతున్న మరో కీలక నేత

Basavraj Patil Quits Congress In Another Big Jolt To Party In Maharashtra

Basavraj Patil Quits Congress In Another Big Jolt To Party In Maharashtra

 

Basavaraj Patil:కాంగ్రెస్‌ (Congress) పార్టీకి లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Polls) ముందు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (working president of the Congress party) బసవరాజ్‌ పాటిల్‌ (Basavaraj Patil) హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాన్‌కులే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సమక్షంలో మంగళవారం మధ్యాహ్నం బీజేపీలో చేరనున్నారు.

బసవరాజ్‌ పాటిల్‌ మరఠ్వాడా ప్రాంతానికి చెందిన ప్రముఖ లింగాయత్‌ నాయకుడు. ఆయన ఔసా నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత అభిమన్యు పవార్‌ చేతిలో ఓటమిపాలయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు పాటిల్ రాజీనామా వార్తలను కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలే ఖండించారు. పాటిల్ నుండి తమకు ఎలాంటి రాజీనామా లేఖ రాలేదని చెప్పారు. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని, అయితే చాలా కాలంగా పార్టీలో జరిగే ఎలాంటి సమావేశాలకూ హాజరుకావడం లేదని తెలిపారు. గత కొన్ని రోజులుగా పార్టీలో యాక్టివ్‌గా లేరన్నారు. పార్టీని వీడినట్లు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయన్నారు. ఈ అంశంపై ఆయన మాతో ఎలాంటి సంప్రదింపులూ జరపలేదని స్పష్టం చేశారు.

read also : మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం: కేటీఆర్‌