BARC jobs 4374 : బార్క్ లో ఉద్యోగాలు.. పది, ఇంటర్, బీటెక్ అభ్యర్థులు అర్హులు..

ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) లో జాబ్ (BARC jobs 4374) ఆపర్చునిటీ !! 

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 03:20 PM IST

ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) లో జాబ్ (BARC jobs 4374) ఆపర్చునిటీ !!   టెక్నికల్ ఆఫీసర్ – సీ , సైంటిఫిక్ అసిస్టెంట్ – బీ , టెక్నీషియన్ – బి పోస్టుల భర్తీకి బార్క్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మూడు విభాగాలలోని మొత్తం 212 పోస్టులలో టెక్నికల్ ఆఫీసర్/ సి పోస్టులు 181, సైంటిఫిక్ అసిస్టెంట్/ బి పోస్టులు 7, టెక్నీషియన్/ బి పోస్టులు 24 ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తామని బార్క్ తెలిపింది. 4162 స్టైపెండరీ ట్రైనీ పోస్టుల కోసం కూడా దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తంగా 4374 పోస్టుల రిక్రూట్‌మెంట్ (BARC jobs 4374) కోసం నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 22. ఆన్‌లైన్‌లో barc.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్లు సమర్పించవచ్చు.

అర్హతలు ఇవీ..

స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1 పోస్టులు 1216 ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు డిప్లొమా, ఐఐటీ, ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీని కలిగి ఉండాలి. మరోవైపు 2 వేల మందికిపైగా స్టైపెండరీ ట్రైనీ 2 కేటగిరీకి 10వ తరగతిలో సైన్స్, మ్యాథ్స్‌లో 60 శాతం మార్కులు ఉండాలి. విద్యార్హతకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్‌ను చూడండి. బయో-సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ తదితర విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జాబ్స్ ఉన్నాయి.

వయోపరిమితి..

2023 మే 22 నాటికి అభ్యర్థుల యొక్క వయస్సు టెక్నికల్ ఆఫీసర్‌ పోస్ట్ కు 18-35 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్ట్ కు 18-30 ఏళ్లు, టెక్నీషియన్‌ పోస్ట్ కు 18-25 ఏళ్లు, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19-24 ఏళ్లు, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2కు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.

also read :  Government Jobs for Engineers: నెలకు రూ.1.80 లక్షల జీతం.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గవర్నమెంట్ జాబ్స్

దరఖాస్తు రుసుము

టెక్నికల్ ఆఫీసర్- సీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ బీ పోస్టుకు రూ.150, టెక్నీషియన్ బీ పోస్టుకు రూ.100 దరఖాస్తు రుసుము ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. మహిళలకు ఫీజు లేదు. వివిధ పోస్టులకు అనుగుణంగా వయోపరిమితిని అడిగారు.

శాలరీ ఇలా..

టెక్నికల్ ఆఫీసర్/ సి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.56,100, సైంటిఫిక్ అసిస్టెంట్ కు రూ.35,400, టెక్నీషియన్ కు రూ.21,700 శాలరీ చెల్లిస్తారు.
ట్రైనింగ్‌ స్కీం (స్టైపెండరీ ట్రైనీ) కేటగిరీ-1 కింద 1216 పోస్టులు, కేటగిరీ-2 కింద 2946 పోస్టులు ఉన్నాయి. వీటికి ఎంపికైన అభ్యర్థులకు కేటగిరీ-1లో నెలకు రూ.24,000 నుంచి రూ.26,000, కేటగిరీ-2లో రూ.20,000 నుంచి రూ.22,000 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ ఇలా..

ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అమరావతి, గుంటూరు , హైదరాబాద్ , కరీంనగర్ , విజయవాడ , విశాఖపట్నంలలో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి.