Site icon HashtagU Telugu

Cheating : ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసపోయిన బ్యాంక్ మేనేజర్.. యువతి కోసం వేగంగా అలాంటి పని చేసి

53d3dd6d 1f70 4117 82d5 D3b35d8665d5

53d3dd6d 1f70 4117 82d5 D3b35d8665d5

బ్యాంకు మేనేజర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక యువతి ఉచ్చులో పడి భార్య అక్రమానికి పాల్పడ్డాడు. ఆన్ లైన్ డేటింగ్ ద్వారా పరిచయమైన ఆ యువతి కోసం ఒక కస్టమర్ కాతా నుంచి విధంగా 6 కోట్ల రుణం తీసి ఆ యువతి ఖాతాలో వేసాడు. ఈ విషయం బ్యాంకు అంతర్గత తనిఖీల్లో బయటపడింది. ఇదే విషయం పై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడం వల్ల బ్యాంకు మేనేజర్​ సహా అతడికి సహాయం చేసిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక బెంగళూరుకు చెందిన హరిశంకర్​ ఇండియన్​ బ్యాంకు హనుమంతనగర్​ శాఖలో మేనేజర్​గా పనిచేస్తున్నాడు.

నాలుగు నెలల కిందట ఓ డేటింగ్​ యాప్​లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతి అతడికి పరిచయమై రోజూ మెసేజ్​ చేస్తూ అతడిని వలలో వేసుకుంది. అలా ఒక రోజు డబ్బులు కావాలంటూ అడగగా రూ.12 లక్షలు ఆమె ఖాతాలో వేశాడు. ఆ తర్వాత మరోసారి డబ్బులు ఇవ్వాలని కోరగా అప్పుడు అతను బ్యాంకులోని అనిత అనే ఖాతాదారురాలి అకౌంట్ ద్వారా దాదాపుగా రూ.6 కోట్లు రుణాన్ని తీసి ఆ యువతి ఖాతాలో వేశాడు. అంతకుముందు అనిత తన ఖాతాలో రూ. 1.3 కోట్లు డిపాజిట్​ చేసుకుంది. తాజాగా రుణం కోసం దరఖాస్తు చేసుకునిదానికి సంబంధించిన పత్రాలను సమర్పించింది.

అయితే, హరిశంకర్​ వాటిని తారుమారు చేసి రూ.6కోట్లు రుణం మంజూరు చేశాడు. ఆ డబ్బును డేటింగ్ యాప్​లో పరిచయమైన యువతికి ఇచ్చాడు. మే 13న అనితకు సంబంధించిన ఫిక్స్​డ్​ డిపాజిట్​ ఖాతా నుంచి రుణం ఇవ్వగా మే 19న అంతర్గతంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. జోనల్​ మేనేజర్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరిశంకర్ సహా అతడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం చేసినట్లు అంగీకరించాడు. హరిశంకర్​ను బుధవారం కోర్టులో హజరుపర్చగా 10 రోజుల పోలీస్​ కస్టడీ విధించింది.