KTR: నా దగ్గర ఆధారాలు ఉన్నాయి..కేటీఆర్‌ అక్రమాస్తుల చిట్టా బయటపెడతాః బండి సంజయ్‌

సంజయ్‌ మీడియతో మాట్లాడుతూ.. త్వరలోనే కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా బయటపెడతానని.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Updated On - April 29, 2024 / 02:04 PM IST

Bandi Sanjay: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో రాజకీయ నేతలు ఒక్కరి పై ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్‌ పార్లమెంట్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌(Bandi Sanjay), బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం (ఈరోజు) సంజయ్‌ మీడియతో మాట్లాడుతూ.. త్వరలోనే కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా బయటపెడతానని.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అక్రమ ఆస్తులపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సైతం బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ఉద్దేశం బీజేపీకి లేదని బండి క్లారిటీ ఇచ్చారు.

Read Also: Savita Pradhan: ఓ IAS సక్సెస్ స్టోరీ..చదివితే కన్నీళ్లు ఆగవు..!

కాగా, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత చేస్తారంటూ కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వేములవాడలో కేటీఆర్ మాట్లాడుతూ.. జూన్ 2 వరకే హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత హైదరాబాద్‌ను బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుందంటూ కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత చేయకుండా అపగలిగే శక్తి ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి పై విధంగా కౌంటర్ ఇచ్చారు.